అసెంబ్లీలో 72 గంటల పాటు..

First Published Mar 27, 2017, 2:00 PM IST
Highlights

నేటితో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలపడంతో సభను నిర్వదికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

 

ఈ నెల 10 న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు జరిగాయి. మొదటి రోజు శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

 

మొత్తం 72 గంటల 33 నిమిషాలు వివిధ అంశాలపై శాసన సభలో చర్చ జరిగింది. సభలో మొత్తం 88 స్టార్డ్  క్వశ్చన్స్ కు మంత్రులు సమాధానం ఇచ్చారు. 30 అన్ స్టార్డ్ ప్రశ్నలకు, మూడు షార్ట్ నోటీస్ ప్రశ్నలకు, 192  సప్లిమెంటరీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

 

5 బిల్లులు ఈ శాసన సభలో ఆమోదం పొందాయి. రెండు కమిటీ రిపోర్టులను కూడా సభ ముందుంచారు. ఈ సమావేశాలకు సంబంధించి సభలో మొత్తం 65 మంది సభ్యులు మాట్లాడారు.

click me!