(వీడియో) టీఆర్ఎస్ నేత గులాబీ పెళ్లి పిలుపును చూశారా..?

Published : Mar 27, 2017, 12:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
(వీడియో) టీఆర్ఎస్ నేత గులాబీ పెళ్లి పిలుపును చూశారా..?

సారాంశం

ఇప్పటివరకు మనం వీడియో వెడ్డింగ్ కార్డులను మాత్రమే చూసుంటాం.. టీఆర్ఎస్ కు చెందిన ఈ ఎమ్మెల్సీ మాత్రం అంతకుమించిన వెడ్డింగ్ కార్డుతో తన కొడుకు పెళ్లికార్డును రూపొందించారు. ఇంతకీ ఆ వెడ్డింగ్ కార్డు విశేషాలేంటో తెలుసా...?  

దేశంలో పెళ్లితంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెద్దోడు నుంచి పేదోడి వరకు అందరూ తమ తాహతుకు మించే పెళ్లి కోసం ఖర్చు చేస్తుంటారు. ఇక డబ్బున్నవాళ్లు అయితే మరీను...

 

పెద్ద నోట్లు రద్దుతో దేశమంతా గగ్గోలు పెడుతుంటే అదే సమయంలో మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం తన కూతురు పెళ్లిని నభూతో న భవిష్యత్ అనే స్థాయిలో జరిపించారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇలాంటి భారీ పెళ్లి ఒకటి జరగబోతోంది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదో తెలుసా...

 

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కుమారుడిది. తన కొడుకు పెళ్లిని ఘనంగా చేయడానికి సంకల్పించిన ఆయన వెడ్డింగ్ కార్డు నుంచే ప్రత్యేక స్టైల్ లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కొడుకు పెళ్లి కోసం వచ్చే అతిథిలకు వెడ్డింగ్ కార్డులోనే గులాబీ రంగు డ్రెస్సును, ఓ వెండి కడియాన్ని కూడా అందజేస్తున్నారు.

మరి అతిథులందరికీ ఒకే సైజు  బట్టలు ఇస్తే ఎలా అనే డౌట్ వస్తుంది కదూ.. అందుకే ఆయన తాను ఆహ్వాన పత్రికలు అందజేయాల్సిన వారి లిస్టును ముందే తయారు చేసుకొని ఆ మేరకు వారి బట్టల కొలతలు కూడా తీసుకున్నారు.

 

అంటే ఆయన కొడుకు పెళ్లికి వచ్చేవారంతా టీఆర్ఎస్ పార్టీ కలర్ అయిన గులాబీ రంగు బట్టల్లో రావాల్సిందేనన్నమాట. పార్టీకి ప్రచారంతో పాటు, పెళ్లికి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేలా రాములు నాయక్ భలే ప్లాన్ తయారు చేశారు కదా.

PREV
click me!

Recommended Stories

Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu