Telangana Assembly elections 2023: కేసీఆర్ మరోసారి సీఎం అవుతారు.. : అసదుద్దీన్ ఒవైసీ

By Mahesh Rajamoni  |  First Published Oct 9, 2023, 4:42 PM IST

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మ‌రోసారి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. మ‌రో ప‌ర్యాయం సీఎంగా కొన‌సాగుతార‌ని తెలిపారు.
 


AIMIM chief Asaduddin Owaisi:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మ‌రోసారి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. మ‌రో ప‌ర్యాయం సీఎంగా కొన‌సాగుతార‌ని తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి విజయం సాధించి మరో దఫా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్న తమ పార్టీ తెలంగాణలోనే కాకుండా రాజస్థాన్ లోనూ దృష్టి సారించిందని వివరించారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరు సమస్యలు ఉన్నాయనీ, అయితే మైనారిటీలకు సంబంధించిన సమస్యలు ముఖ్యమైనవని, సామాజిక సాధికారత విషయంలో అవి ఇంకా వెనుకబడి ఉన్నాయని ఆయన అన్నారు.

Latest Videos

undefined

ఎంఐఎంను బీజేపీ బీ-టీమ్గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ఎలా టార్గెట్ చేస్తోందన్న ప్రశ్నకు అసదుద్దీన్ సమాధానమిస్తూ, 2004లో, ఆ తర్వాత 2008లో వామపక్షాలు తమ మద్దతును నిలిపివేసినప్పటికీ తమ పార్టీ కాంగ్రెస్ కు ఎలా మద్దతిచ్చిందో గుర్తు చేశారు. ఇది వారి కపటత్వానికి, రాజకీయ అహంకారానికి, మేధో నిజాయితీకి పరాకాష్ట అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండ‌గా, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం గురించి కూడా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. పాలస్తీనా గురించి దివంగత బీజేపీ నేత ఒకరు అరబ్ కమ్యూనిటీకి చెందిన భూములను ఆక్రమించారని చెప్పారని గుర్తు చేశారు.  ప్ర‌స్తుతం ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. పాలస్తీనాకు సంఘీభావంగా భారత్ పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసిందని ఆయన తెలిపారు. భారతదేశం ఎల్లప్పుడూ పాలస్తీనాకు మద్దతు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందులో మార్పు వచ్చిందని తెలిపారు.

click me!