ఈ నెల 16న జరగాల్సిన బీఆర్ఎస్ సభ వాయిదా: దసరా తర్వాత సభ

Published : Oct 09, 2023, 03:38 PM ISTUpdated : Oct 09, 2023, 03:51 PM IST
ఈ నెల 16న జరగాల్సిన బీఆర్ఎస్ సభ వాయిదా: దసరా తర్వాత సభ

సారాంశం

ఈ నెల  16న నిర్వహించాల్సిన  సభను బీఆర్ఎస్ వాయిదా వేసింది.ఈ నెల  26 లేదా 27 తేదీల్లో నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తుంది.

హైదరాబాద్: ఈ నెల 16న జరగాల్సిన  వరంగల్ లో నిర్వహించాల్సిన బీఆర్ఎస్ బహిరంగ సభను  ఆ పార్టీ వాయిదా వేసింది.  ఈ నెల  చివర్లో ఈ బహిరంగ సభ ను నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది.ఈ నెల  16వ తేదీన నిర్వహించే బహిరంగ సభలో  ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేయాలని బీఆర్ఎస్ భావించింది.అయితే కొన్ని కారణాలతో  ఈ సభను ఈ నెల  26 లేదా 27 తేదీన నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుందని  సమాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  ఇవాళే షెడ్యూల్ విడుదలైంది. గత నెలలో  అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.  నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.   ఈ నాలుగు స్థానాల్లో కూడ అభ్యర్థులను  ప్రకటించనున్నారు.  మరో వైపు  ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దసరా తర్వాత  ఈ సభను  నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వరంగల్ లో నిర్వహించే సభ ద్వారా  మరోసారి  తెలంగాణ ప్రజలకు  తమ ప్రభుత్వం ఇప్పటివరకు  ఏం చేశాం... మరోసారి అధికారాన్ని అప్పగిస్తే  ఏ కార్యక్రమాలను చేయనున్నామనే  అంశాలను కూడ బీఆర్ఎస్ నాయకత్వం వివరించనుంది.తెలంగాణ సీఎం  కేసీఆర్  ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నిన్నటి నుండి  కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అనారోగ్యం నుండి కోలుకోవడంతో  పార్టీ కార్యక్రమాలపై  కేసీఆర్ దృష్టి పెట్టారని సమాచారం.  దసరా పర్వదినం నేపథ్యంలో  సభను వాయిదా వేయాలని  బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుందని సమాచారం.తెలంగాణ సీఎం  కేసీఆర్  ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నిన్నటి నుండి  కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అనారోగ్యం నుండి కోలుకోవడంతో  పార్టీ కార్యక్రమాలపై  కేసీఆర్ దృష్టి పెట్టారని సమాచారం.  దసరా పర్వదినం నేపథ్యంలో  సభను వాయిదా వేయాలని  బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుందని సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే