Telangana Assembly Elections 2023:  బీఆర్ఎస్ అభ్య‌ర్థుల విష‌యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌చారం ముమ్మ‌రం

By Mahesh Rajamoni  |  First Published Sep 22, 2023, 9:50 AM IST

Hyderabad: వ‌రుస‌గా మూడో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) వ్యూహాలు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు. పార్టీ నాయ‌కులంద‌రూ కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం కొన‌సాగించాల‌ని సూచిస్తున్నారు. 


Telangana Chief Minister K Chandrasekhar Rao (KCR): ఈ ఏడాది చివ‌ర‌లో తెలంగ‌ణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌రుస‌గా మూడో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) వ్యూహాలు ర‌చిస్తున్నారు. దీనిలో భాగంగా ముమ్మ‌రంగా ప్ర‌చారం చేస్తున్నారు. పార్టీ నాయ‌కులంద‌రూ కూడా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం కొన‌సాగించాల‌ని సూచిస్తున్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన 115 అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండవనీ, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అధినాయకత్వం అభ్యర్థులను ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేయగా, అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సర్వే నివేదికల ఆధారంగా కనీసం 20-25 మంది అభ్యర్థులను పార్టీ మారుస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఏడుగురు మినహా మిగిలిన వారందరినీ కొనసాగించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇతర పార్టీల్లోకి ఫిరాయింపులను నిరోధించే ఎత్తుగడ భావిస్తున్నారు. ఇదే క్ర‌మంలోనే పార్టీ ప్ర‌క‌టించిన ప‌లువురు అభ్య‌ర్థుల్లోనూ ఆందోళన వ్య‌క్త‌మ‌వుతుండ‌టం.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆటంకం క‌లిగించే అంశాల్లో ఒక‌టిగా ఉంది.

Latest Videos

దీనికితోడు కొంతకాలంగా ఉమ్మడి ఎన్నికలు జరిగే అవకాశం ఉండడం, ఎన్నికలు ఆలస్యమవడంతో అభ్యర్థులను ప్రచారంలో నెమ్మదించాలని నాయకత్వం కోరిందని స‌మాచారం. ఉమ్మడి ఎన్నికలపై చర్చ తగ్గుముఖం పట్టడంతో అభ్యర్థులు ప్రచారాన్ని పునఃప్రారంభించాలని ఆ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే, ప్ర‌స్తుతం అభ్య‌ర్థుల విష‌యంలో కొన‌సాగుతున్న‌ అన్ని ఊహాగానాలకు తెరదించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి, రెండు వారాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా భావించే అవకాశం ఉన్నందున ఈ జాబితాకు కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం.

లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా భావించే అవకాశం ఉన్నందున ఈ జాబితాకు కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. దీనికి తోడు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు మంత్రి హరీశ్ రావుపై, పార్టీపై విరుచుకుపడిన అంశం కూడా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఈ నెల 26వ తేదీన హనుమంతరావు పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతానని హెచ్చరించారు. అయితే, ఆయనపై చ‌ర్య‌లు లేదా పార్టీ నుంచి తొలగించడానికి బీఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై మౌనం వహించారు.

click me!