TS SC-ST Commission: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్‌, సభ్యుల నియామకం

Published : Sep 22, 2023, 01:30 AM IST
TS SC-ST Commission: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్‌, సభ్యుల నియామకం

సారాంశం

TS SC-ST Commission: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌(TS SC-ST Commission)కు నూతన చైర్మన్, సభ్యులను రాష్ర్ట  ప్రభుత్వం నియమించింది.

TS SC-ST Commission: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్  )నియామకమయ్యారు.

కమిటీ సభ్యులుగా కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్), రాంబాబు నాయక్ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ(ఎస్సీ మాదిగ, కరీంనగర్), జిల్లా శంకర్ (ఎస్సీ మాదిగ, నల్లగొండ జిల్లా), రేణికుంట ప్రవీణ్ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్) ను సీఎం కేసీఆరు. నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ళ శ్రీనివాస్ పనిచేశారు. అయితే.. ఆయన పదవీ కాలం  ఇటీవల ముగిసింది. దీంతో ఆ పదవి ఖాళీగా ఉంది.
 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...