తెలంగాణ కాంగ్రెస్ లో మరింత జోష్... మద్దతు ప్రకటించిన ముస్లిం లీగ్ పార్టీ

By Arun Kumar P  |  First Published Nov 6, 2023, 11:46 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగేలా రాజకీయ సమీకరణలు మారాయి. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  మంచి దూకుడుమీదుంది. ఇప్పటికే పలు పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే మరికొన్ని బేషరతుగా మద్దతు ప్రకటించాయి. తాజాగా మరో పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఆ పార్టీ లేఖ రాసింది.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ పార్టీ  నేషనల్ జనరల్ సెక్రటరీ, కేరళ ఎమ్మెల్యే పి.కె కునాలి కుట్టి రాహుల్ కు లేఖ రాసారు.  

Latest Videos

తెలంగాణలో ఐయూఎంఎల్ పార్టీకి బలమైన పునాదులు వున్నాయని... లీడర్లతో పాటు క్యాడర్ కూడా వుందని కునాల్ కుట్టి తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసి కేంద్రంలోని ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని ఐయఎంల్ తెలిపింది. ఇలా బిజెపిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమవంతు క‌ృషి చేస్తున్నామని కునాల్ కుట్టి తెలిపారు. 

Read More  కాంగ్రెస్ ఖతర్నాక్ ప్లాన్ వేసిందిగా... అప్పటివరకు రాహుల్, ప్రియాంక తెలంగాణను వీడరట...

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఐయూఎంఎల్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపుకోసం యాక్టివ్ గా పనిచేస్తారని కునాల్ కుట్టి తెలపారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.   2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఇండియా కూటమి గెలుపుకు ఇది నాందిగా నిలుస్తుందని కునాల్ కుట్టి వెల్లడించారు. 

ఇదిలావుంటే ఇప్పటికే వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ, ప్రొఫెసర్ కొదండరాం తెలంగాణ జనసమితి పార్టీలు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయి. వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ తో చేయి కలిపేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఐయూఎంఎల్ మద్దతు కాంగ్రెస్ కు మరింత ప్లస్ కానుంది. 
 

click me!