అన్నారం బ్యారేజీ (annaram barrage)లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaleshwaram project)లో భాగంగా ఉన్న ఈ బ్యారేజిలోని నీటిని 10 రోజులుగా అధికారులు గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీలో 1.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Annaram barrage : అన్నారం బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ (kaleshwaram project)లో భాగంగా ఉన్న ఈ బ్యారేజిలోని నీటిని 10 రోజులుగా అధికారులు గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారని ‘ఈనాడు’ కథనం పేర్కొంది. దీంతో బ్యారేజీలో ప్రస్తుతం నీరు తగ్గిపోయాయి. కొన్ని రోజుల కిందట బ్యారేజీలోని రెండు పియర్ల సమీపంలో బుంగలు ఏర్పడ్డాయి. దీంతో ఇంజనీరింగ్ అధికారులు అప్రమత్తమయ్యారు.
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు, నలుగురు మృతి..
వెంటనే దానిని కట్టడి చేశారు. అయితే కొంత కాలం కిందట కేంద్ర జల సంఘం అధికారులు బ్యారేజీని పరిశీలించేందుకు వచ్చారు. కాగా.. నాలుగు రోజుల నుంచి 7,8,10 నెంబర్ గేట్లను ఎత్తారు. వాటి ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఆదివారం మాత్రం దానిని ఒకే గేటుకు పరిమితం చేయడంతో ప్రవాహం కిందికి తక్కువగానే వెళ్లింది.
BJP -JANASENA: పొత్తయితే కుదిరింది.. మరీ ప్రచారం సంగతేంటీ ? జనసేనానికి ఎదురయ్యే తిప్పలేంటీ?
ఇదిలా ఉండగా.. నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఓ వైపు రాళ్లు, ఇసుక తేలి కనిపిస్తోంది. కాగా.. బ్యారేజీలో ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 2300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 900 క్యూసెక్కుల కిందికి వదిలివేశారు.