Telangana Assembly Elections 2023: నువ్వా.. నేనా.. ? ఎన్నిక‌ల పైచేయి కోసం బీఆర్ఎస్-కాంగ్రెస్ హోరాహోరీ..

By Mahesh Rajamoni  |  First Published Sep 22, 2023, 11:02 AM IST

Hyderabad: తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను ప్రజలకు వివరించేందుకు అన్ని వర్గాలకు చేరువవుతున్నారు. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్ర‌చార దూకుకు పెంచింది. ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ ల మ‌ధ్య  ప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరు ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  
 


Telangana Assembly Elections 2023: తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను ప్రజలకు వివరించేందుకు అన్ని వర్గాలకు చేరువవుతున్నారు. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్ర‌చార దూకుకు పెంచింది. ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడో సారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. నువ్వా నేనా అనే విధంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ ల మ‌ధ్య  ప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరు ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ జోష్ లో తమ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను ప్రజలకు వివరించేందుకు అన్ని వర్గాలకు చేరువవుతున్నారు. ఇదిలావుంటే, అధికార బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కీర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటేనని విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌జ‌లు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Latest Videos

undefined

హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయభేరి సభకు వచ్చిన అపూర్వ స్పందనతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ఎలా తరలి వచ్చారో అర్థంకాని బీఆర్ఎస్ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని ఆందోళన చెందుతున్నార‌ని చెప్పిన‌ట్టు డీసీ నివేదించింది. తాము ఇచ్చిన ఆరు హామీల గురించి ప్రజలకు వివరిస్తున్నామనీ, త్వరలోనే హన్మకొండలో ప్రతి ఇంటికీ గ్యారంటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

తుక్కుగూడ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని కరీంనగర్ డీసీ అధ్యక్షుడు కే.సత్యనారాయణ డీసీకి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. బూటకపు హామీలతో మోసం చేసిన బీఆర్ఎస్, కేసీఆర్ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీల‌ను నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రాన్ని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ఆరు హామీలతో మళ్లీ రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఒక జాతీయ పార్టీ ప్రత్యేక రాష్ట్రాల కోసం ప్రత్యేక ఎన్నికల మేనిఫెస్టోలను ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్ర కాదా? ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ ఆరు హామీలను అమలు చేస్తున్నాయా అని ప్రశ్నించారు. రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో జరిగిన సభలో టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు వల్ల బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న మంచి ఇమేజ్ ను కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. అవినీతికి మారుపేరుగా ఉన్న కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించబోరని విమ‌ర్శించారు.

click me!