KCR: గెలుపు బీఆర్ఎస్ దే.. గ‌తంలో కంటే 5-6 సీట్లు ఎక్కువ గెలుచుకుంటామ‌న్న సీఎం కేసీఆర్

By Mahesh Rajamoni  |  First Published Aug 21, 2023, 5:10 AM IST

Hyderabad: ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల కోసం కొందరు కొత్త బిచ్చగాళ్లు వచ్చారనీ, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అలాంటి మోస‌పూరిత మాట‌లు నమ్మవద్దని బీఆర్‌ఎస్ చీఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 


Telangana Assembly Elections 2023: ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో తెలంగాణ రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు (కేసీఆర్) ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీల‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల కోసం కొందరు కొత్త బిచ్చగాళ్లు వచ్చారనీ, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అలాంటి మోస‌పూరిత మాట‌లు నమ్మవద్దని బీఆర్‌ఎస్ చీఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ గ‌త 2018 ఎన్నిక‌ల కంటే ఈసారి 5-6 సీట్లు అధికంగా గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. సూర్యాపేటలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు శ్రీకారంచుట్టిన సీఎం.. అక్క‌డ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 5-6 సీట్లు అధికంగా గెలుచుకుంటామని చెప్పారు. 2018లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 స్థానాలు గెలుచుకుని టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అధికారాన్ని నిలబెట్టుకుంది.

Latest Videos

undefined

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన కేసీఆర్ ఎన్నికలకు కొత్త బిచ్చగాళ్లు వచ్చారని, తప్పుడు హామీలతో ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క ఛాన్స్ కోరుకుంటున్నారు. మ‌రి గత 50 ఏళ్లలో ఏం చేశారు అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే సీనియర్ సిటిజన్లు, వితంతువులు, ఇతరులకు నెలకు రూ.4,000 పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోందని బీఆర్ఎస్ చీఫ్ అన్నారు. అయితే, వారు పాలిస్తున్న ఇత‌ర రాష్ట్రాల్లో రూ.4 వేల పింఛన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ పింఛన్ ను పెంచుతుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. పెంపు పరిమాణాన్ని పార్టీ త్వరలోనే ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.

అంతకుముందు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ నూతన భవనాలు, సమీకృత వ్యవసాయ మార్కెట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారనీ, అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. సూర్యాపేట, భువనగిరి, నల్లగొండలో మెడికల్ కాలేజీల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ రైతు వ్యతిరేకులని మండిపడ్డారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని బీజేపీ భావిస్తుంటే, రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ చెబుతోందన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కరెంటు కోతలు మొదలయ్యాయని కేసీఆర్ అన్నారు.

రెండు దఫాలుగా రూ.37 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దళారుల ప్రమేయం లేకుండా అమలవుతున్నాయనీ, ధరణి పోర్టల్ ను రద్దు చేయడం ద్వారా దళారుల వ్యవస్థను తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ధరణి పోర్టల్ లేకుండా రైతుబంధు, రైతుబీమా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ తో కేవలం 15 నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటు ద్వారానే తమ భవితవ్యాన్ని తామే రాసుకోవచ్చని, ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

click me!