Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున ఎన్నికలో బరిలో దింపబోయే అభ్యర్థలు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్టు ఇవ్వనని ఇప్పటికే తేల్చి చెప్పేశారు.
Telangana Assembly Elections 2023: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున ఎన్నికలో బరిలో దింపబోయే అభ్యర్థలు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది సిట్టింగ్‌లకు ఇవ్వనని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. అయితే, వారిలో 2018 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారే అధికంగా ఉన్నారని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వారిలో అధికులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడంతో.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో కొత్తముఖాలను కూడా బరిలోకి దింపనున్నారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
టిక్కెట్లు కోల్పోయే పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే.. !
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న నాయకులు వీరే..
కొత్తగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దక్కించుకునే వాళ్లు వీరే..
మూడో సారి అధికారంలోకి రావడానికి తమముందున్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని చూస్తున్న కేసీఆర్.. ఎవరికి టిక్కెట్టు ఇచ్చిన పార్టీ గెలుపు కోసం నాయకులందరూ పనిచేయాలని సూచించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నాయకులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం, పార్టీ లో వారు నడుచుకున్న తీరు, క్యాడర్ ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.