Telangana: ఎన్నిక‌ల‌కు మొద‌లైన కౌంట్‌డౌన్‌.. 15న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ వరుస సభలు

By Mahesh Rajamoni  |  First Published Oct 10, 2023, 9:58 AM IST

BRS Manifesto: తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లైంది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు, హామీల‌పై దృష్టి సారించి ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు ఎన్నిక‌ల హామీల‌ను ప్ర‌క‌టించ‌గా, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎలాగైనా మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నెల 15న ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. మ‌హిళ‌లు, యువ‌త‌, ఉపాధి, పెన్ష‌న‌ర్లు వంటి ప‌లు అంశాల‌కు సంబంధించి మేనిఫెస్టో ప‌లు హామీల ఉండ‌బోతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలు సూచిస్తున్నాయి.


Telangana Assembly Elections 2023: తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లైంది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు, హామీల‌పై దృష్టి సారించి ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు పార్టీలు ఎన్నిక‌ల హామీల‌ను ప్ర‌క‌టించ‌గా, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎలాగైనా మ‌రోసారి అధికారంలోకి రావ‌డానికి వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నెల 15న ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. మ‌హిళ‌లు, యువ‌త‌, ఉపాధి, పెన్ష‌న‌ర్లు వంటి ప‌లు అంశాల‌కు సంబంధించి మేనిఫెస్టో ప‌లు హామీల ఉండ‌బోతున్నాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలు సూచిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులతో సమావేశమైన సందర్భంగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. అదే రోజు (అక్టోబర్ 15) ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ బీ-ఫారమ్‌లను జారీ చేస్తుందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, సూచనలు, సలహాలు, వ్యూహాల‌ను కేసీఆర్ వివరిస్తారు. అంతేకాకుండా, ఎన్నికల ప్రచారానికి సంబంధించి పార్టీ అభ్యర్థులకు ఆయన నిర్దిష్టమైన సూచనలను చేస్తార‌ని స‌మాచారం.

Latest Videos

undefined

కేసీఆర్ వరుస పర్యటనలు..

అలాగే, ఈ సమావేశం తరువాత, కేసీఆర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుంటారు, అక్కడ అదే రోజు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఎన్నిక‌ల షెడ్యూల్ నేప‌థ్యంలో కేసీఆర్ వ‌రుస బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు కేసీఆర్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 16న జనగాం, భోంగీర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో బహిరంగ సభలో పాల్గొని.. మరుసటి రోజు సిద్దిపేట, సిరిసిల్లలో పర్యటించనున్నారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, నవంబర్ 9న కేసీఆర్ పోటీ చేసే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన గజ్వేల్, కామారెడ్డి నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన నామినేషన్లను దాఖలు చేయడానికి ముందు, ఆయ‌న సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమ‌వారం ప్ర‌కటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10న నామినేషన్లకు చివరి తేదీ కాగా, నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణ‌తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల‌కు కూడా ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించింది.

click me!