కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం: బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన

By narsimha lode  |  First Published Oct 10, 2023, 9:48 AM IST

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  బస్సు యాత్ర తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.


హైదరాబాద్: బస్సు యాత్ర తర్వాతే  అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  అభ్యర్థుల ఎంపికపై  కసరత్తు ఇంకా పూర్తి కాలేదు.  ఇప్పటివరకు  వంద అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్టుగా  సమాచారం.  

ఈ నెల 15నే  అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే అభ్యర్థుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. దీంతో  అభ్యర్థుల ప్రకటన బస్సు యాత్ర తర్వాతే ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ  న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఇప్పటికే  ఒక్క అభ్యర్థి పేరున్న స్థానాలకు అభ్యర్థుల పేర్లను  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసింది. ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లున్న స్థానాల్లో  జాబితా ఖరారు చేసేందుకు గాను  కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు  న్యూఢిల్లీకి వెళ్లి  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమకే టిక్కెట్టు ఇవ్వాలని పార్టీ అగ్రనేతలు కోరుతున్నారు.

Latest Videos

undefined

ఇదిలా ఉంటే  యూత్ కాంగ్రెస్, మహిళలు, బీసీ, కమ్మ సామాజిక వర్గాల నుండి టిక్కెట్ల కేటాయింపు విషయమై  డిమాండ్లున్నాయి.ఈ డిమాండ్లకు అనుగుణంగా టిక్కెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.

ఈ నెల  15న  బస్సు యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ  నిర్ణయం తీసుకుంది.ఇవాళ జరిగే కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో  బస్సు యాత్రపై కాంగ్రెస్ చర్చించనుంది.  ఈ నెల  15న  బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు  ప్రియాంక గాంధీ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ తర్వాత  రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో బస్సు యాత్ర సాగే సమయంలో  రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొనేలా  కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేస్తుంది.  ఈ నెల  19,20, 21 తేదీల్లో  రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ  తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడ  బస్సు యాత్రలో పాల్గొంటారు. రాహుల్ గాంధీ తర్వాత ఖర్గే  బస్సు యాత్రలో పాల్గొంటారు బస్సు యాత్ర ముగింపు సభలో  సోనియా గాంధీ  పాల్గొనేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

also read:సీపీఐ, సీపీఎంలకు రెండు అసెంబ్లీ సీట్లు: కాంగ్రెస్ నిర్ణయం

ఈ ఏడాది నవంబర్ 30న  తెలంగాణలో పోలింగ్ జరగనుంది.  ఈ ఏడాది డిసెంబర్  3న ఓట్ల లెక్కింపు జరగనుంది.  ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.

click me!