తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ఉత్కంఠరేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా రెడ్డి 3500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహేశ్వరంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ తరపున శ్రీరాములు యాదవ్ పోటీ చేశారు. బీఆర్ఎస్ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది ఓటమి దిశగా వెళుతున్నారు. అయితే సీనియర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి సత్తా చాటుతున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ హవా నడుస్తుంది. కొన్ని ఏరియాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఖమ్మంతో పాటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటుతుంది. సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే ఆమె స్వల్ప మెజారిటీ మాత్రమే దక్కింది . బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది.
Also Read... Telangana Assembly Election Results 2023 LIVE : కేసీఆర్ తో సహా ఆరుగురు మంత్రులు వెనుకంజ