95 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా జోనల్ వ్యవస్థ: అసెంబ్లీలో కేటీఆర్

By narsimha lodeFirst Published Sep 27, 2021, 3:54 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిని దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని పలు సంస్థలు ప్రశంసించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలు, ఐటీ రంగాలపై అభివృద్దిని సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.

హైదరాబాద్: నీతి ఆయోగ్ (niti asyog) తో పోటు అనేక సంస్థలు తెలంగాణ(telangana) అభివృద్దిని ప్రశంసిస్తున్నాయని  తెలంగాణ మంత్రి  కేటీఆర్ (ktr)గుర్తు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై  సోమవారం నాడు   అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.

95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా జోనల్ వ్యవస్థను(zonal) తీసుకొచ్చినట్టుగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.స్కిల్, రీస్కిల్, అన్‌స్కిల్ అమలు చేయాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రపంచంలో పోటీపడేలా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.హైద్రాబాద్, మేడ్చల్ లో పరిశ్రమలు వస్తే సరిపోదని కేటీఆర్ అన్నారు. అన్ని జిల్లాల్లో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు

కరీంనగర్‌లో(karimnagar) ఐటీ హబ్‌ ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ లాంటి పట్టణాల్లో కూడ ఐటీ పరిశ్రమలు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్పలమని కేటీఆర్ చెప్పారు.

ప్రపంచం మొత్తం నాలుగో పారిశ్రామిక విప్లవం ముందుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.దేశంలో 67 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారేనని మంత్రి తెలిపారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగు నీటి రంగం అసాధారణ అభివృద్ది జరిగిందని కేటీఆర్ చెప్పారు.ఐటీ రంగంలో అభివృద్ది జరిగిందని బీజేపీ, ఎంఐఎంలు కూడ ఒప్పుకొన్నాయని మంత్రి తెలిపారు.టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 17,300 పరిశ్రమలకు అనుమతిచ్చామని మంత్రి చెప్పారు.


 

click me!