కూకట్‌పల్లి నవ వధువు సుధారాణి హత్య కేసు: ఆన్‌లైన్‌లో కత్తి ఆర్డర్ చేసిన కిరణ్

Published : Sep 27, 2021, 03:23 PM IST
కూకట్‌పల్లి నవ వధువు సుధారాణి హత్య కేసు:  ఆన్‌లైన్‌లో కత్తి ఆర్డర్ చేసిన కిరణ్

సారాంశం

హైద్రాబాద్ కూకట్‌పల్లి  నవవధువు సుధారాణి హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను తమ దర్యాప్తులో గుర్తించారు.  సుధారాణిని హత్య చేసేందుకు కిరణ్ ఆన్‌లైన్ లో ఆర్డర్ చేశాడు. నాలుగు రోజుల క్రితం కామారెడ్డి నుండి సుధారాణిని తీసుకొచ్చి హత్య చేశాడు నిందితుడు కిరణ్.

హైదరాబాద్: హైద్రాబాద్(hyderabad) కూకట్‌పల్లి(kukatpally) సుధారాణి  (sudha Rani)హత్య కేసులో  కీలక విషయాలను దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. హత్య చేసేందుకు సైకో కిల్లర్ కిరణ్ (kiran) ఆన్‌లైన్ లో కత్తిని ఆర్డర్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పెళ్లైన 28 రోజులకే నవ వధువు సుధారాణిని  సైకో కిల్లర్ కిరణ్ హత్యచేసినట్టుగా  పోలీసులు తెలిపారు.పెళ్లికి ముందే కిరణ్ సుధారాణిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుండి కిరణ్ నటించాడని  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

also read:భార్యకు తన తండ్రితో అక్రమ సంబంధం అంటగట్టి.. కూకట్‌పల్లి నవవధువు హత్య కేసులో కొత్త కోణం

అయితే జనవరి నుండి కిరణ్ సుధారాణిని వేధింపులకు గురి చేశాడు. అయితే దగ్గరి బంధువు కావడంతో కిరణ్ వేధింపులను ఆమె మౌనంగా భరించింది.  అయితే సుధారాణి కుటుంబసభ్యులు కిరణ్ తో సుధారాణి వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు సుధారాణి, కిరణ్ మధ్య నిశ్చితార్ధం చేశారు.

నిశ్చితార్ధం అయిన తర్వాత కూడ సుధారాణిని హత్య చేసేందుకు కిరణ్ ప్రయత్నించారు.జూలై నుండి హైద్రాబాద్ లోనే సుధారాణి, కిరణ్ లు నివాసం ఉంటున్నారు.పెళ్లైన 28 రోజులకే సుధారాణిని సైకో కిల్లర్ కిరణ్ హత్యచేశాడు. సుధారాణిని హత్య చేసేందుకు కిరణ్ ఆన్‌లైన్ లో కత్తిని ఆర్డర్ చేసి కొనుగోలు చేశాడు. నాలుగు రోజుల క్రితం కామారెడ్డిలో ఉన్న సుధారాణిని  కిరణ్ హైద్రాబాద్ తీసుకొచ్చాడు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత సుధారాణిని తాను కొనుగోలు చేసిన కత్తితో గొంతు, కాళ్లు, కడుపు భాగంలో కోసి హత్య చేశాడు. సుధారాణిని హత్య చేసిన నిందితుడు కిరణ్  ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !