
Asara Pensions : తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అండతా నిలుస్తూ నెలనెలా 'ఆసరా పెన్షన్లు' అందిస్తోంది. అయితే ఈ పెన్షన్ల పంపిణీలో తాజాగా భారీ అక్రమాలు వెలుగుచూశాయి. చనిపోయినవారికి కూడా ఇంకా ఫెన్షన్లు వస్తున్నాయి... ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో సీరియస్ యాక్షన్ కు సిద్దమయ్యింది. ఇలా మరోసారి జరక్కుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.4,016 ఇస్తోంది. అయితే ఇలా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులను గుర్తించి పెన్షన్లు అందిస్తున్నారు... ఇప్పటివరకు వారికి ప్రతినెలా పెన్షన్ డబ్బులు అందుతున్నాయి. అయితే ఈ ఆసరా పెన్షన్ల వ్యవహారంలో బారీగా గోల్ మాల్ జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. చనిపోయనవారి పేర్లను పెన్షనర్ల జాబితా నుండి తొలగించాలి... కానీ కొందరు అధికారులతో క్షేత్రస్థాయి ఫించన్ల పంపిణీ సిబ్బంది కుమ్మక్కయి ఇలాంటివారి పెన్షన్ డబ్బులు దోచుకుంటున్నట్లు తేలింది.
ఒకరిద్దరు కాదు ఇప్పటికే చనిపోయిన 28 వేల మందికి ఇంకా పెన్షన్లు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇలా చనిపోయినవారి పేరట గత ఏడాదికాలంగా రూ.60 కోట్లు జమ అయ్యాయని... ఈ డబ్బంతా ఏమయ్యిందో గుర్తించేపనిలో పడింది ప్రభుత్వం. ఈ సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. అలాగే అవినీతికి పాల్పడిన అధికారులపై కూడా చర్యలు తీసుకోనున్నారు. చనిపోయినవారి కుటుంబసభ్యుల నుండి కూడా డబ్బులు రికవరీ చేయనున్నారు.
సాధారణంగా పెన్షన్ల అర్హుల జాబితాను ప్రతి 3 నెలలకు ఓసారి అధికారులు తనిఖీ చేస్తారు. ఈ సమయంలోనే చనిపోయినవారిని గుర్తించి జాబితా నుండి తొలగించాలి. కానీ ఇలా తనిఖీ చేయాల్సిన అధికారులు, పెన్షన్లు పంపిణీచేసే సిబ్బంది కుమ్మక్కయి ఫెన్షన్ డబ్బులను దోచుకుంటున్నట్లు తేలింది. గత ఏడాదికాలంగా 28 వేల మంది పెన్షనర్లు చనిపోయిన వారిపేరిట ఇంకా డబ్బులు జమ అవుతున్నాయి... ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతుందో గుర్తించేపనిలో పడింది ప్రభుత్వం.