నువ్వు ఎవరికి అమ్ముడుపోయావ్, ఎవరికి బానిసవు:రచనా రెడ్డికి శోభారాణి కౌంటర్

Published : Dec 02, 2018, 04:06 PM IST
నువ్వు ఎవరికి అమ్ముడుపోయావ్, ఎవరికి బానిసవు:రచనా రెడ్డికి శోభారాణి కౌంటర్

సారాంశం

మాజీ టీజేఎస్ నేత అడ్వకేట్ రచనారెడ్డిపై టీ టీడీపీ మహిళా నేత శోభారాణి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తే మంచిగ ఉండదంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గుడి పరిపాలన సాగుతోందని, ఆ పరిపాలనకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అంతా ఏకమై పోరాటం చేస్తున్న క్రమంలో రచనారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. 

హైదరాబాద్: మాజీ టీజేఎస్ నేత అడ్వకేట్ రచనారెడ్డిపై టీ టీడీపీ మహిళా నేత శోభారాణి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తే మంచిగ ఉండదంటూ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గుడి పరిపాలన సాగుతోందని, ఆ పరిపాలనకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు అంతా ఏకమై పోరాటం చేస్తున్న క్రమంలో రచనారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం సరికాదన్నారు. 

నిన్న మెున్నటి వరకు కేసీఆర్ కు వ్యతిరేకంగా, ఆయన దోపిడీకి వ్యతిరేకంగా గళమెత్తిన రచనారెడ్డి నేడు ప్రజాకూటమిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. ఒక ఉద్యమ నేత కోదండరామ్ గురించి మాట్లాడటం,ఈ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం గురించి మాట్లాడటం సరికాదని పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. 

మెున్నటి వరకు అడ్వకేట్ గా ఉన్నావ్, నేడు రాజకీయాల్లోకి వచ్చావ్. నీకు ఏ తరహా రాజకీయాలు కావాలో నువ్వే తేల్చుకో అంతేకానీ ఆ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంది ఈ పార్టీ టిక్కెట్లు అమ్ముకుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు. మీరు ఎక్కడ నుంచి ఎలా వచ్చారో తెలియదు కానీ తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

రచనారెడ్డి ఎవరికి తొత్తుగా వ్యవవహరించాలనుకుంటున్నారో, ఎవరికి బానిసగా పనిచెయ్యాలనుకుంటున్నారో మీఎజెండా మీకు ఉండొచ్చు కానీ టీడీపీని విమర్శిస్తే ఊరుకోమన్నారు. తెలంగాణ జనసమితిలో ఏం జరిగిందో అన్నది మీకు కోదండరామ్ కు సంబంధించిన విషయం దానిపై అన్ని పార్టీలను విమర్శించడం సరికాదన్నారు శోభారాణి. 

ఈ వార్తలు కూడా చదవండి

కోదండరామ్‌కు షాక్...టీజేఎస్ ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి రాజీనామా

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu