కొడంగల్ ప్రజల వల్లే.. కేసీఆర్ కి రాజకీయ జీవితం..రేవంత్

By ramya neerukondaFirst Published Dec 2, 2018, 3:30 PM IST
Highlights

కొడంగల్ ప్రజలు ఓట్లు  వేయకపోయి ఉంటే.. కేసీఆర్ కి రాజకీయ జీవితమే ఉండేది కాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. 


కొడంగల్ ప్రజలు ఓట్లు  వేయకపోయి ఉంటే.. కేసీఆర్ కి రాజకీయ జీవితమే ఉండేది కాదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రజలు ఓట్లు వేయడం వల్లే 2009లో కేసీఆర్.. మహబూబ్ నగర్ ఎంపీ అయ్యారని రేవంత్ గుర్తు చేశారు. అలాంటి కొడంగల్ పై ఇప్పుడు కేసీఆర్ కక్ష కట్టారని రేవంత్ ఆరోపించారు.

ఆదివారం రేవంత్ రెడ్డి కొడంగల్ లో మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా కేసీఆర్ కొడంగల్ లో అడుగుపెట్టలేదని రేవంత్ గుర్తు చేశారు.  కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కేంద్రం నిధులు ఇచ్చినా కూడా.. తనమీద ఉన్న కక్షతో దానిని పక్కన పెట్టేశారని మండిపడ్డారు.

 మిషన్‌ భగీరథలో కమీషన్లకు కొడంగల్‌ బలైందని ఆయన వ్యాఖ్యానించారు. కొడంగల్‌ ప్రజల పట్ల కేసీఆర్‌ వివక్ష చూపిస్తున్నారని, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి కొడంగల్‌కు తాగునీరు రాకుండా అడ్డుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. వికారాబాద్‌ రైల్వే లైన్‌ కోసం రాష్ట్ర వాటాను చెల్లించకపోవడంతో కృష్ణా- వికారాబాద్‌ లైన్‌ తమ ప్రాంతానికి శాశ్వతంగా దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కొడంగల్‌ అభివృద్ధి కేసీఆర్‌కు ఇష్టం లేదని, ఈ ప్రాంతంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు కాకపోవడానికి ఆయనే కారణమని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. కోస్గి మండలంలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

read more news

కొడంగల్ లో కేసీఆర్ సభ.. రేవంత్ ఏమన్నాడంటే..

కొడంగల్ లో హైడ్రామా.. వివరణ ఇచ్చిన అడిషనల్ డీజీ

కొడంగల్‌లో రేవంత్ అనుచరుల ఇళ్లలో సోదాలు

click me!