పాలకుర్తిలో టీఆర్ఎస్ ప్రచార హోరు: కల్లుపట్టిన ఎర్రబెల్లి

Published : Dec 02, 2018, 03:32 PM IST
పాలకుర్తిలో టీఆర్ఎస్ ప్రచార హోరు: కల్లుపట్టిన ఎర్రబెల్లి

సారాంశం

పాలకుర్తి నియోకజవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో పర్యటించిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.   

జనగామ: పాలకుర్తి నియోకజవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో పర్యటించిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

అడుగు అడుగున జన నీరాజనం పలికారు. డప్పుసప్పుల్లతో, మంగళహారతులతో, బతుకమ్మ బోనాలతో కడవెండి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. 

తన రాజకీయ జీవితంలో నిత్యం ప్రజలతోనే ఉన్నానని ప్రజలతోనే గడుపుతున్నానని నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సంందర్భంగా గౌడన్నల కోరిక మేరకు కల్లు పట్టారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం