తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

By Nagaraju penumalaFirst Published Aug 18, 2019, 5:58 PM IST
Highlights

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని విమర్శించారు. 
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపించారు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు. కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు గరికపాటి మోహనరావు. గరికపాటితోపాటు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ తోపాటు 30 మంది తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. 

తెలంగాణలో పార్టీ పరిస్థితిపై పదేపదే చంద్రబాబుకు సూచించినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. తెలుగదేశం పార్టీకోసం ఎంతో కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను వెన్నంటే ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణలో బాబ్లీ ప్రాజెక్టు కోసం దెబ్బలు తిన్నానని గుర్తు చేశారు. 

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని విమర్శించారు. 

అందువల్లే తల్లిలాంటి పార్టీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారందరికీ న్యాయం చేయాలని నడ్డాను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం యెుక్క దశదిశలను మారుస్తామని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు


 

click me!