అవిశ్వాసానికి మద్ధతివ్వండి.. టీఆర్ఎస్ ఎంపీలను కలిసిన టీడీపీ ఎంపీలు..

First Published Jul 15, 2018, 4:31 PM IST
Highlights

త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎంపీలు.. టీఆర్ఎస్ ఎంపీలను కోరారు

త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాల్సిందిగా టీడీపీ ఎంపీలు.. టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనా చౌదరి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ ఎంపీలు హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి వివరించి ప్రత్యేకహోదా విషయంలో పార్లమెంట్‌లో తాము చేయబోయే పోరాటానికి మద్ధతు కోరారు..

అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం.. విభజన హామీల అమలుపై చర్చించామని చెప్పారు. ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని  టీఆర్ఎస్ ఎంపీలు అంగీకరించారని.. త్వరలో జరగబోయే అఖిలపక్ష భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరినట్లు సుజనా తెలిపారు.

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్ధతు  అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు సానుకూలంగా స్పందించారని సుజనా వెల్లడించారు. టీఆర్ఎస్ ఎంపీలను కలిసిన వారిలో కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్ మాల్యాద్రి ఉన్నారు.. 
 

click me!