ఆ ఆరోపణను నిరూపిస్తే రూ.24 కోట్లిస్తా: మాజీ ఎంపీ వివేక్

First Published Jul 14, 2018, 6:17 PM IST
Highlights

తనపై కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపి, టీఆర్ఎస్ లీడర్ వివేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విశాఖ ఇండస్ట్రీస్ తరపున హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున రూ.12 కోట్లు అదనంగా తీసుకున్నారన్న వీహెచ్ ఆరోపణలను వివేక్ ఖండించారు. ఈ ఆరోపణలను సాక్ష్యాలతో సహా రుజువు చేస్తే రూ.24 కోట్లు వెనక్కియ్యడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. లేని పక్షంలో వీహెచ్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సవాల్ కు వీహెచ్ సిద్దంగా ఉంటే చెప్పాలన్నారు.

ఇటీవల తనపై కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని మాజీ ఎంపి, టీఆర్ఎస్ లీడర్ వివేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విశాఖ ఇండస్ట్రీస్ తరపున హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున రూ.12 కోట్లు అదనంగా తీసుకున్నాడన్న వీహెచ్ ఆరోపణలను వివేక్ ఖండించారు. ఈ ఆరోపణలను సాక్ష్యాలతో సహా రుజువు చేస్తే రూ.24 కోట్లు వెనక్కియ్యడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. లేని పక్షంలో వీహెచ్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సవాల్ కు వీహెచ్ సిద్దంగా ఉంటే చెప్పాలన్నారు.
 
జూలై 8వ తేదీన జరిగిన హెచ్‌సీఏ ప్రత్యేక జనరల్ బాడీ  సమావేశంలో వీహెచ్ కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని వివేక్ గుర్తుచేశారు. తనపైనే కాకుండా మొత్తం తన కుటుంబంపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.గత కొన్నాళ్లుగా వీహెచ్ మతిస్థిమితం కోల్పోయినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

గతంలో అర్షద్ అయూబ్ హెచ్‌సీఏ అద్యక్షుడిగా ఉన్నపుడు విశాఖ ఇంస్ట్రీస్‌తో ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారని, దీంతో అప్పుడు మేము ఆర్బిట్రేషన్ కి వెళితే రూ.25.92 కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చారని వివేక్ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఒక్క పైసా కూడా విశాఖ ఇండస్ట్రీస్ కి ఇవ్వలేదని అన్నారు. రూ.12 కోట్ల అదనంగా తీసుకున్నాన్న వీహెచ్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వివేక్ తెలిపారు.

అవినీతి ఆరోపణలతో కోర్టు కేసులను ఎదుర్కొంటూ  నిందితులుగా ఉన్న వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా తనపై ఉన్న సస్పెన్షన్‌పై కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తానని వివేక్ వెల్లడించారు.
 

click me!