అహంకారానికి, ఆత్మాభిమానానికి మద్య యుద్ధం: కేసీఆర్‌పై తరుణ్‌చుగ్

Published : Jun 11, 2021, 03:48 PM IST
అహంకారానికి, ఆత్మాభిమానానికి మద్య యుద్ధం: కేసీఆర్‌పై తరుణ్‌చుగ్

సారాంశం

తెలంగాణలో అహంకారానికి ఆత్మాభిమానానికి మద్య యుద్దం జరుగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ అన్నారు. 

హైదరాబాద్:తెలంగాణలో అహంకారానికి ఆత్మాభిమానానికి మద్య యుద్దం జరుగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ అన్నారు. శుక్రవారంనాడు హైద్రాబాద్ షామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ అహంకారికి అతని ఆవినీతినికి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ టిఆర్ఎస్ లో  సమాజంలో కూడా గొంతు ఎత్తారన్నారు. ఆ గొంతును నొక్కి కేసీఆర్ నొక్కారని ఆయన చెప్పారు.  రాజ్యఅహంకారంతో అణగదొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. 

also read:బీజేపీలో చేరనున్న టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డి: ఈటల నివాసంలో తరుణ్‌చుగ్‌తో భేటీ

తెలంగాణ కోసం, తెలంగాణ ప్రగతి కోసం గత ఇరవై సంవత్సరాలుగా ఈటల రాజేందర్ కొట్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభత్వం తన విధి మర్చిపోయిందన్నారు.కేసీఆర్ ఆయన కుటుంబం కోసం తెలంగాణ వచ్చినట్టుందని తనకు కన్పిస్తోందన్నారు.తెలంగాణ రాష్ట్ర లక్ష్యం వెనక్కు పోయిందని చెప్పారు. తెలంగాణ సమాజం కోసం  ఈటల రాజేందర్ పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.   తెలంగాణ వికాసాన్ని తామంతా కోరుకొంటున్నామని తరుణ్ చుగ్ చెప్పారు.  ఈటల రాజేందర్ శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని ప్రకటించారు.. తమతో కలిసి వస్తున్నారని చెప్పారు.

తెలంగాణలో  తానీషా పాలనను అతని అహంకారాన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. జననేత, ఉద్యమకారుడు ఈటలకి భారతీయ జనతా పార్టీ  స్వాగతం పలుకుతుందని ఆయన ప్రకటించారు.  తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమకారుడు ఈ రోజు కేసీఆర్ ను వదిలి పెట్టి బయటికి వస్తున్నారన్నారు.. కేసీఆర్ అహంకారం ఒడిపోతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?