ఈ నెల 14న బీజేపీలోకి ఈటల: రాజేందర్ ఇంటికి తరుణ్ చుగ్

Published : Jun 11, 2021, 02:40 PM IST
ఈ నెల 14న బీజేపీలోకి ఈటల:  రాజేందర్ ఇంటికి తరుణ్ చుగ్

సారాంశం

మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఇంటికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్  గురువారం నాడు వెళ్లారు.

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్  ఇంటికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్‌చుగ్  గురువారం నాడు వెళ్లారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్  గత వారంలో  టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ నెల 14న ఆయన బీజేపీలో చేరనున్నారు. 

also read:స్పీకర్ కార్యాలయానికి ఈటల:ఈ నెల 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా

ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికతో  పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  ఈ సమావేశం తర్వాత ఈటల రాజేందర్  ఇంటికి తరుణ్ చుగ్ సహా పలువురు నేతలు వెళ్లారు.తరుణ్ చుగ్ తో  ఎమ్మెల్యేలు రఘునందన్  రావు,. రాజా సింగ్ లు ఉన్నారు. ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కూడ వీరితో ఉన్నారు.  

ఈటల రాజేందర్ ను బీజేపీలో ఆహ్వానించేందుకు తురుణ్ చుగ్ వచ్చారని సమాచారం. ఈ నెల 12న హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా సమర్పించనున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయంలో అందించనున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే