తెలంగాణలో అరాచకం సృష్టించేందుకే... పేపర్ లీక్ తో బిజెపి కుట్ర: మంత్రి జగదీశ్ రెడ్డి (వీడియో)

Published : Apr 05, 2023, 01:21 PM ISTUpdated : Apr 05, 2023, 01:29 PM IST
తెలంగాణలో అరాచకం సృష్టించేందుకే... పేపర్ లీక్ తో బిజెపి కుట్ర: మంత్రి జగదీశ్ రెడ్డి (వీడియో)

సారాంశం

తెలంగాణలో పేపర్ల లీకేజీ బిజెపి రాజకీయ కుట్రలో భాగమేనని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. 

సూర్యాపేట : రాజకీయ లబ్ది కోసమే బండి సంజయ్ పదో తరగతి ప్రశ్నపత్నం లీక్ చేయించారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన సంజయ్ ని బిజెపి అధ్యక్ష పదవి నుండి తొలగించడమే కాదు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మంత్రి డిమాండ్ చేసారు. ప్రశ్నపత్రాల లీకేజీలో రాజకీయ పార్టీల పాత్ర వుండటం దురదృష్టకరమని జగదీశ్ రెడ్డి అన్నారు. 

టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ చేయించి సంజయ్ అడ్డంగా దొరికిపోయినా ఈ వ్యవహారంలో ఆయనదేమీ తప్పు లేదు అన్నట్లుగా బిజెపి నాయకులు సమర్దించుకోవడం సిగ్గుచేటని అన్నారు. చట్టాన్ని అతిక్రమించి పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లి మరీ ఓ దొంగను తప్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని బిజెపి కుట్రలు పన్నుతోందని జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. 

Read More  అనర్హత వేటేయాలి: బండి సంజయ్ పై హరీష్ రావు ఫైర్

పథకం ప్రకారమే ప్రశ్నపత్రాల లీకేజీ జరుగుతోందని... తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇందుకోసమే బిజెపి క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని... ఈ ట్రాప్ లో విద్యార్థులు, నిరుద్యోగులు పడొద్దని జగదీశ్ రెడ్డి సూచించారు. 

వీడియో

బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలిచి భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుంటే... వాటిని అడ్డుకుని యువత జీవితాలతో బిజెపి చెలగాటం ఆడుతోందని అన్నారు. ఇలాంటి బిజెపి నాయకులకు ప్రజలే గ్రామాల్లో తిరగకుండా నిలదీయాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువతను బిఆర్ఎస్ కు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. 

ఇక బండి సంజయ్ అరెస్ట్ పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం..!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం..!!! బీజేపి నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీకు చేసి అమాయకులైన  విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ  #BJPleaks అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసారు కేటీఆర్. 

ఇక టెన్త్ పేపర్ లీక్  వెనుక  సూత్రధారి, పాత్రధారి  బండి సంజయ్ అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.టెన్త్ క్లాస్  పేపర్ లీక్ చేసింది  బీజేపీ కార్యకర్త  ప్రశాంత్ ... అతడితో ఈ పని చేయించి సంజయ్ అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన బండి సంజయ్ ఎంపీగా కొనసాగకుండా అనర్హత వేటు వేయాలని హరీష్ డిమాండ్ చేసారు. 

 
  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?