వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ స్కూల్ నుండి వాట్సాప్ లో పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కేసు నమోదు చేశారు. మరో వైపు ఈ ఘటనపై ప్రభుత్వం నివేదిక కోరింది.
వికారాబాద్: జిల్లాలోని తాండూరు ప్రభుత్వ స్కూల్ నుండి టెన్త్ క్లాస్ పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్నాపత్రం వాట్సాప్ లో షేర్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై విద్యాశాఖాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారంనాడు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఎంఈఓ వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పరీక్ష ప్రారంభమైన అరగంటకు వాట్సాప్ లో పేపర్ షేర్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బందెప్ప అనే టీచర్ ఈ పేపర్ ను షేర్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై బందెప్పను పోలీసులు ప్రశ్నించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ ను ఇన్విజిలేటర్ ఎలా తీసుకెళ్లాడని పోలీసులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నారు. తాండూరు టెన్త్ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండ్ , ఇన్విజిలేటర్ బందెప్పతో పాటు మరొకరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది.
also read:తాండూరులో టెన్త్ పేపర్ లీక్ ప్రచారం: పోలీసుల దర్యాప్తు
తాండూరు స్కూల్ లో పేపర్ లీక్ కాలేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత వాట్సాప్ గ్రూప్ లో పేపర్ ను షేర్ చేశారని విద్యాశాఖాధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత పేపర్ బయటకు రావడం పేపర్ లీక్ కిందకు రాదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఇవాళ తెలంగాణ టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన అరగంటకే వాట్సాప్ లో పేపర్ బయటకు వచ్చింది. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాండూరు ప్రభుత్వ స్కూల్ నుండి టెన్త్ క్లాస్ పేపర్ లీకైందనే ప్రచారంపై డీఈఓ రేణుకాదేవి కలెక్టర్ నారాయణరెడ్డితో సమావేశమయ్యారు. తాండూరు స్కూల్లో ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు.
వాట్సాప్ లో బందెప్ప ఓ ప్రైవేట్ టీచర్ కు పేపర్ ను షేర్ చేశారని పోలీసులు గుర్తించారు. దీని వెనుక ఉద్దేశ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ బయటకు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. వాట్సాప్ లో బయటకు వచ్చిన పేపర్ ద్వారా చిట్టీలు తయారు చేసేందుకు ప్రయత్నించారని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కానీ పరీక్ష పూర్తయ్యే లోపుగా చిట్టీలు తయారు చేయలేకపోయినట్టుగా అధికారులు ప్రకటించారు.