అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సొంత కార్యాలయంలోనే ఆమె సజీవదహనం కావడం విచారకరం. అయితే నిందితుడు సురేశ్, విజయారెడ్డిల మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా.. లేక మరేదైనా కారణం వల్ల ఈ ఘటన జరిగిందా అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సొంత కార్యాలయంలోనే ఆమె సజీవదహనం కావడం విచారకరం. అయితే నిందితుడు సురేశ్, విజయారెడ్డిల మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా.. లేక మరేదైనా కారణం వల్ల ఈ ఘటన జరిగిందా అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిందితుడు సురేశ్ కుటుంబసభ్యుల వర్షన్ చూస్తే.. తమకు ఎలాంటి భూ వివాదాలు లేవని అతని తల్లి మీడియాకు తెలిపారు. తనకు ఒక్కడే కుమారుడని అలాంటప్పుడు భూవివాదాలు ఎందుకు ఉంటాయని ఆమె తేల్చిచెప్పారు. తన బిడ్డ ఎమ్మార్వో ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో తనకు అర్థంకావడం లేదన్నారు.
undefined
నిందితుడి సోదరి మాట్లాడుతూ.. సురేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని మా ఇద్దరి మధ్యా ఎలాంటి వివాదాలు లేవని, తన సోదరుడు మంచివాడని ఆమె తెలిపారు. తమకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వ్యవహారాలన్ని తండ్రే చూసుకుంటాడని సురేశ్ సోదరి తెలిపింది.
Also Read:tahsildar Vijaya: భూవివాదమే కారణమా, ఎవరీ విజయా రెడ్డి?
ఉదయం తండ్రితో కలిసి కట్టెలు కొట్టి బయటకు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదన్నారు. అటు గ్రామస్తులు సైతం సురేశ్ ఎంతో మంచివాడని, అందరితో కలివిడిగా ఉండేవాడని చెబుతున్నారు.
ప్రస్తుతం సురేశ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని హయత్‌నగర్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మరో హాస్పిటల్‌కు తరలించారు. సురేశ్ కోలుకుంటేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత సురేశ్ రోడ్డుపైకి పరుగులు తీశాడు. అదే సమయంలో హత్యపై 100కి తహశీల్దార్ కార్యాలయం ఉద్యోగులు సమాచారం అందించారు. రోడ్డుపై పరిగెడుతూ పెట్రోలింగ్ వాహనానికి సురేశ్ ఎదురుపడ్డాడు.
Also Read:తహిసీల్దార్ విజయారెడ్డి హత్య.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు
దీంతో వాహనాన్ని ఆపిన పోలీసులు గాయాలపై ఆరా తీశారు. రియాక్టర్ పేలి ప్రమాదానికి గురయ్యానని సురేశ్ అబద్ధం చెప్పాడు.. వెంటనే సురేశ్‌ను హయత్‌నగర్ సన్‌రైజ్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సనందించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.
అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరికి గాయాలు అయ్యాయి.