tahsildar Vijaya: భూవివాదమే కారణమా, ఎవరీ విజయా రెడ్డి?

By narsimha lode  |  First Published Nov 4, 2019, 5:28 PM IST

అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం వెనుక భూ వివాదమే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 



హైదరాబాద్: భూ వివాదం కారణంగానే అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి దాడికి దిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయమై తహసీల్దార్ విజయారెడ్డితో  గొడవకు దిగి ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్టుగా సమాచారం.

also read:తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం: విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Latest Videos

undefined

ఎమ్మార్వో విజయారెడ్డి చాంబర్‌ నుండి  బయటకు వచ్చే సమయంలో  సార్ట్‌ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించినట్టుగా నిందితుడు సురేష్ చెప్పి ఎమ్మార్వో చాంబర్ నుండి  బయటకు వెళ్తూ చెప్పాడు.  అంతేకాదు ఎమ్మార్వో కార్యాలయం నుండి వెళ్తూ షర్ట్ విప్పేసి పోలీస్ స్టేషన్‌ వద్ద కుప్పకూలిపోయాడు.  

Also Read:తహిసీల్దార్ విజయారెడ్డి హత్య.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్ మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా గుర్తించారు. సురేష్‌తో పాటు ఆయన సోదరుడికి మధ్య భూ వివాదాలు ఉన్నాయని సమాచారం. ఈ విషయమై సురేష్ భూ వివాదాల రికార్డుల కోసం విజయారెడ్డిపై దాడికి పాల్పడిపై ఆమెపై పెట్రోల్  పోసి నిప్పంటించాడని సమాచారం.

తన భూమి సమస్యలు పరిష్కారించాలని కొంతకాలంగా సురేశ్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. తన భూ వివాదం కోసమే సురేష్ అబ్దుల్లాపూర్‌మెట్టు గ్రామానికి వచ్చినట్టుగా సమాచారం.

అయితే ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. సురేష్ మాత్రం చాలా మంచివాడని చెబుతున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో తమకు ఎలాంటి పని లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్క కొండారం గ్రామంగా గుర్తించారు.  విజయారెడ్డి తండ్రి సి. లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరయ్యాడు. మిర్యాలగూడ మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డిని విజయారెడ్డి పెళ్లి చేసుకొన్నారు.

సుభాష్ రెడ్డి  డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో గతంలో ఎమ్మారోగా పనిచేసిన విజయారెడ్డి కొద్దినెలల క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌కు వచ్చారు. భూములకు సంబంధించిన పాస్‌బుక్కుల వ్యవహారంలో గతంలో పలువురితో ఆమె వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తోంది.మధ్యాహ్నం పూట ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చి విజయారెడ్డితో గొడవకు దిగి సురేష్ ఆమెపై పెట్రో‌ల్ పోసి నిప్పంటించాడు.
 

click me!