
హైదరాబాద్:
యూపీఏ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. రెండోరోజు తెలంగాణలో పర్యటిస్తున్న రాహుల్ వల్ల రాష్ట్రానికి కానీ హైదరాబాద్ నగరానికి కానీ జరిగేదేమీ లేదన్నారు.
రాహుల్ ఏ రాష్టంలో పర్యటిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్నారు. చచ్చిన పార్టీకి మెరుగులు దిద్దడం కోసమే రాహుల్ తెలంగాణ పర్యటన అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు పెట్టింది పేరని ఆరోపించారు. ఎవరెన్ని పర్యటనలు చేసిన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.