దంపతుల మధ్య వివాదం: ఇద్దరి వద్దా డబ్బులు లాగిన సిఐ

Published : Aug 14, 2018, 02:36 PM ISTUpdated : Sep 09, 2018, 11:30 AM IST
దంపతుల మధ్య వివాదం: ఇద్దరి వద్దా డబ్బులు లాగిన సిఐ

సారాంశం

భార్య భర్తల మధ్య వివాదం...తమ కాపురం చక్కబెట్టండి అంటూ ఇరువురు పోలీసులను ఆశ్రయించారు. భార్య భర్తల మధ్య వివాదాన్ని గమనించిన సీఐ ఇద్దరినీ క్యాష్ చేసుకున్నారు.

హైదరాబాద్:
భార్య భర్తల మధ్య వివాదం...తమ కాపురం చక్కబెట్టండి అంటూ ఇరువురు పోలీసులను ఆశ్రయించారు. భార్య భర్తల మధ్య వివాదాన్ని గమనించిన సీఐ ఇద్దరినీ క్యాష్ చేసుకున్నారు. ఇద్దరి దగ్గర చెరోక లక్ష గుంజి సెటిల్మెంట్ చేసేశాడు. ఒక్కటైన భార్యభర్తలు సీఐ తమ దగ్గర కాజేసిన డబ్బులు విషయం చెప్పుకుని పోలీసు ఉన్నతాధికారిని కలిసి మెురపెట్టుకున్నారు. న్యాయం చెయ్యాల్సిన పోలీసు లక్షలు దోచుకుని సస్పెండ్ కు గురయ్యారు. ఈ ఘటన మల్కాజిగిరిలో చోటు చేసుకుంది.

 మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలో ఓ దంపతులు మధ్య నెలకొన్న వివాదం నెలకొంది. ఆ వివాదాన్ని సెటిల్ చేసేందుకు మల్కాజిగిరి సీఐ ప్లాన్ వేశాడు. భార్య దగ్గర లక్ష రూపాయలు...భర్త దగ్గర మరో లక్ష రూపాయలు తీసుకుని ఇరువురి మద్య నెలకొన్న వివాదాన్ని సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఒక్కటైన ఆ భార్య భర్తలు సీ కొమరయ్య ఒకరికి తెలియకుండా మరోకరి దగ్గర ఇలా తమ దగ్గర చెరో లక్ష రూపాయలు వసూలు చేసినట్లు తెలుసుకుని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ కొమరయ్యపై సీపీ అంజనీకుమార్ సస్పెండ్ వేటు వేశారు.  


 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం