రాహుల్‌తో టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య భేటీ, ఎందుకంటే?

By narsimha lodeFirst Published Aug 14, 2018, 2:27 PM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మంగళవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి రాజకీయ  ప్రాధాన్యత లేదని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.  

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మంగళవారం నాడు సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి రాజకీయ  ప్రాధాన్యత లేదని ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.  

తెలంగాణలోని ఎల్బీనగర్  నుండి టీడీపీ నుండి గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య  విజయం సాధించారు.  మంగళవారం నాడు  హైద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.

మంగళవారం నాడు  తాజ్‌కృష్ణా హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో ముగిసిన  సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 
ఈ సమావేశం తర్వాత  పలువురు ప్రముఖులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను పురస్కరించుకొని తాను రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నట్టు ఆర్. కృష్ణయ్యచెప్పారు.

గతంలో జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు కోసం తాను చేసిన పోరాటం ఫలించిన విషయాన్ని ఆర్. కృష్ణయ్య చెప్పారు.  ఇదే తరహలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై  కాంగ్రెస్ పార్టీ  సహకరించాలని తాను కోరనున్నట్టు కృష్ణయ్య చెప్పారు.

ఈ భేటీకి  రాజకీయంగా ప్రాధాన్యత లేదని  ఆర్. కృష్ణయ్య చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం  ప్రతినిధులు  కూడ రాహుల్ గాంధీ  సమావేశంలో కూడ పాల్గొన్నారు.జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఈ వార్త చదవండి

ఆసక్తికరం: రాహుల్‌ మీటింగ్‌కు నారా బ్రహ్మణి


 

click me!