స్టేట్‌హోమ్‌కు భర్తను చంపిన నాగర్‌కర్నూల్ స్వాతి

First Published Jul 27, 2018, 6:52 PM IST
Highlights

 ప్రియుడి మోజులోభర్త సుధాకర్ రెడ్డిని చంపిన కేసులో అరెస్టైన స్వాతి 8 మాసాల తర్వాత జైలు నుండి విడుదలైంది. స్వాతి జైలు నుండి విడుదలైన ఆమెను తీసుకెళ్లేందుకు ఎవరూ కూడ రాలేదు.

నాగర్‌కర్నూల్: ప్రియుడి మోజులోభర్త సుధాకర్ రెడ్డిని చంపిన కేసులో అరెస్టైన స్వాతి 8 మాసాల తర్వాత జైలు నుండి విడుదలైంది. స్వాతి జైలు నుండి విడుదలైన ఆమెను తీసుకెళ్లేందుకు ఎవరూ కూడ రాలేదు. దీంతో ఆమెను జైలు అధికారులే స్టేట్‌హోమ్ కు తరలించారు.

2017 నవంబర్ లో సుధాకర్ రెడ్డిని ప్రియుడు రాజేష్ సహాయంతో స్వాతి చంపేసింది. భర్త స్థానంలో రాజేష్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. యాసిడ్ దాడి జరిగిందని కుటుంబసభ్యులను నమ్మించింది.

భర్త శవాన్ని అడవుల్లో దగ్దం చేసింది. ఆ తర్వాత ఆసుపత్రిలో రాజేష్ కు ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేయించింది.ఈ తరుణంలోనే మటన్ సూప్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సుధాకర్ రెడ్డి కాదని రాజేష్ గా తేలింది.

దీంతో రాజేష్ ను, ఆమె ప్రియురాలు స్వాతిని  పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. జైల్లోనే ఉన్న స్వాతికి బెయిల్ ఈ నెల 24 తేదీన లభించింది. కానీ, ఆమెను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకురాలేదు.

ఇంతకాలం పాటు జైల్లో ఉన్న స్వాతిని చూసేందుకు ఆమె తల్లిదండ్రులు కూడ రాలేదు. తమ అల్లుడు సుధాకర్ రెడ్డిని చంపిన స్వాతి చనిపోయిందని ఆనాడే ఆమె తండ్రి ప్రకటించారు.  కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరూ రాకపోవడంతో స్వాతిని పోలీసులు స్టేట్‌హోమ్ కు తరలించారు.

స్వాతి ఒంటరిగా బయటకు వస్తే భర్త సుధాకర్ రెడ్డి బంధువుల నుండి ప్రాణహాని ఉండే అవకాశం ఉందని పోలీసులు ఆమెను స్టేట్‌హో‌మ్ కు తరలించారు. ఇదిలా ఉంటే స్వాతి పిల్లలు ఆమె పుట్టింట్లోనే ఉంటున్నారు.

మరిన్ని స్వాతి వార్తలను చదవండి::ప్రియుడి కోసం భర్తను చంపిన నాగర్ కర్నూల్ స్వాతి: ఏ దిక్కూ లేక చివరికిలా...

 

click me!