హైద్రాబాద్‌లో దారుణం: ప్రియుడితో కలిసి భర్తను సజీవ దహనం చేసిన భార్య

By narsimha lode  |  First Published Dec 5, 2019, 2:50 PM IST

వనస్థలిపురంలో రమేష్ అనే వ్యక్తి సజీవ దహనం కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రియుడి మోజులో స్వప్న భర్త రమేష్ ను హత్యచేసినట్టుగా హైద్రాబాద్ పోలీసులు తేల్చారు. . 


హైదరాబాద్: హైదరాబాద్ వనస్థలిపురం ఎస్‌కెడి నగర్ లో రమేష్ అనే వ్యక్తి సజీవ దహనం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని  భావించి  భర్త రమేష్ ను చంపింది భార్య స్వప్న. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ వనస్థలిపురంలోని ఎస్‌కెడి నగర్ లో ఈ ఏడాది నవంబర్ 26వ తేదీన రమేష్ తన గుడిసెలో సజీవ దహనమయ్యాడు. కొంత కాలం క్రితం రమేష్, స్వప్నను పెళ్లి చేసుకొన్నాడు.

Latest Videos

రమేష్, స్వప్నల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. స్వప్నకు వెంకటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన రమేష్ భార్యను హెచ్చరించారు. 

అయినా ఆమెలో మార్పు రాలేదు. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టాడు. అయితే  తాను తన ప్రియుడు వెంకటయ్యతో సంబంధాలను తెగదెంపులు చేసుకొంటానని స్వప్న తేల్చి చెప్పింది.

అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.  తన ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త రమేష్ అడ్డుగా ఉన్నాడని స్వప్న భావించింది.  తన భర్త అడ్డును తొలగించుకోవాలని భావించింది.

ఈ నెల 26వ తేదీన తన గుడిసెలో నిద్రపోతున్న రమేష్ను స్వప్న ప్రియుడితో కలిసి హత్య చేసింది. రమేష్ నిద్రిస్తున్న సమయంలో  గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే రమేష్ షార్ట్ సర్క్యూట్  తో మంటల్లో సజీవ దహనమయ్యాడని భార్య స్వప్న స్థానికులను నమ్మించింది.

దిశ సెల్‌ఫోన్ పాతిపెట్టిన నిందితులు, స్వాధీనం

అయితే ఈ గుడిసెకు ఎదురుగా ఉన్న ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా పుటేజీని పరిశీలించిన పోలీసులు రమేష్ ప్రమాదవశాత్తు మరణించలేదని గుర్తించారు. రమేష్ ను ప్రియుడు వెంకటయ్యతో కలిసి స్వప్న చంపిందని గుర్తించిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.పోలీసుల విచారణలో స్వప్న తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయాన్ని ఒప్పుకొన్నట్టుగా తెలిసింది.

click me!