Justice for Disha: దిశ ఘటనపై కాంగ్రెస్ పోరుబాట, సీఎల్పీ వద్ద ఎమ్మెల్యేల నిరసన

Published : Dec 05, 2019, 01:27 PM ISTUpdated : Dec 05, 2019, 01:28 PM IST
Justice for Disha: దిశ ఘటనపై కాంగ్రెస్ పోరుబాట, సీఎల్పీ వద్ద ఎమ్మెల్యేల నిరసన

సారాంశం

మహిళలపై అత్యాచారాలను నియంత్రించేందుకు మహిళలల రక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.   

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ ఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో సీఎల్పీ ఛాంబర్ లో జరిగిన సమావేశంలో నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

సీఎల్పీ సమావేశం అనంతరం ప్లకార్డులతో సీఎల్పీ హాల్ ముందే ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. మహిళలపై అత్యాచారాలను నియంత్రించేందుకు మహిళలల రక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 

అలాగే శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలపాలని సీఎల్పీ తీర్మానించింది. అనంతరం విద్యార్థులు, యువతతో కలిసి ట్యాంక్ బండ్ నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. అనంతరం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిసి  వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

justice for disha:12 మందితో సిట్ ఏర్పాటు..

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా మహిళలపై జరుగుతున్న దాడులు, కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలపై ఒక నివేదికను కూడా అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చర్చించారు. పోలీసింగ్ వ్యవస్థపై కూడా కాస్త అసహనం వ్యక్తం చేసింది సీఎల్పీ. 

అటు సీఎల్పీ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎల్పీ ఎదుటే నిరసన తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు నివారించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ లను రహదారిపై తొలగించాలని డిమాండ్ చేశారు. 

Justice For Disha:సీల్డ్ కవర్లో కోర్టుకు కీలక ఆధారాలు...
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ