స్వాదాద్రి ఎండీ యార్లగడ్డ రఘు వేయి కోట్ల రూపాయల వసూలుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ తో అతని ప్లాన్ బెడిసికొట్టినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: అధిక వడ్డీలు ఆశ చూపి వేయి కోట్ల రూపాయలు వసూలు చేయాలని స్వదాద్రి రియల్ ఎస్టేట్ యజమాని రఘు లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తితో విధించిన లాక్ డౌన్ కారణంగా అతని ప్లాన్ బెడిసికొట్టింది. ప్లాట్లు ఆశ చూపి, అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి రఘు రూ.150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన విషయం తెలిసింది.
అతని వ్యవహారాలకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వదాద్రి డైరెక్టర్ గా తాను స్వయంగా కాకుండా ఏజెంట్ల ద్వారానే లావాదేవీలు నిర్వహించినట్లు బయటపడింది. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుల ద్వారా బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది.
undefined
Also Read: రూ.156 కోట్ల స్వాదాద్రి స్కామ్: మహిళతో సహా ముగ్గురి అరెస్టు
రఘు హైరాబాదులోనూ విజయవాడలోనూ పెద్ద యెత్తున కుటుంబ సభ్యుల పేర్ల మీద, 15 మంది ఏజెంట్ల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆందోళన చెందవద్దని పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసులు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు.
పెట్టిన డబ్బులకు రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మించి దాదాపు వేయి మందిని అతను మోసం చేసినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రఘు మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒక ఏజెంట్ ముగ్గురిని చేర్పిస్తే అధిక మొత్తం ఇస్తానని అతను అశపెట్టాడు.