
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నేపథ్యంలోనే తయారుచేసిన వైరస్ కిల్లర్ అనే పరికరాన్ని శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.
ప్రపంచాన్ని సార్స్, ఎబోలా పట్టి పీడిస్తున్న తరుణంలో వాటిని అంతం చేయడానికి దక్షిణ కొరియా ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది గాలిలో ఉన్న వైరస్‌ను తనలోకి లాక్కొని వాటిని అంతం చేయడం ద్వారా దానిని నిర్మూలిస్తుంది.
ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ఉర్జా క్లీన్ టెక్ సంస్థ దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ సర్వీస్ సేవలు అందిస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదనరావు, వైస్ ప్రెసిడెంట్ విష్ణు భరద్వాజ్‌లు మంత్రికి ఈ పరికరం గురించి వివరించారు.
పరికరం ఉన్న పరిసరాల్లో ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవని తెలిపారు. సెమినార్ హాళ్లు, తరగతి గదుల వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో ఈ పరికరాలు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు