
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని నాచారంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాచారంలోని కనకదుర్గ వైన్స్ లో నాగి అనే వ్యక్తి మృతి చెందాడు. వైన్స్ సిబ్బంది నాగి మృతదేహాన్ని బైటికి ఈడ్చేశారు.
మద్యం తాగడానికి వైన్స్ కు వెళ్లాడు నాగి అనే వ్యక్తి. మద్యం తాగిన తరువాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో సిబ్బంది అతడిని బైట పడేశారు. ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. సమాచారం అందుకున్న బంధువులు వచ్చి చూసేసరికి అప్పటికే నాగి మృతి చెంది ఉన్నాడు. దీంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు.. నాగి మృతదేహంతో వైన్స్ ముందు ఆందోళన చేపట్టారు. నాగి మృతి అనుమానాస్పదంగా ఉందని అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.