బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం, తల్లీకూతుళ్లు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు...

Published : Jul 04, 2023, 07:39 AM ISTUpdated : Jul 04, 2023, 10:32 AM IST
బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం, తల్లీకూతుళ్లు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు...

సారాంశం

బండ్లగూడలో రోడ్డుప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. అతి వేగంతో వస్తున్న కారు వాకర్స్ మీదికి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఓవర్ స్పీడ్ తో మార్నింగ్ వాకర్స్ మీదికి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలుమృతి చెందారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కారు డ్రైవర్ దగ్గర మారణాయుధాలు గుర్తించామని తెలిపారు. 

ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారని స్తానికులు చెబుతున్నారు. అయితే, పోలీసులు ఒక్కరినే అరెస్ట్ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే కారులోని ఓ బ్యాగులో మారణాయుధాలు దొరకడం. కత్తులు, తల్వార్లు కనిపించాయి. దీంతో వీరు నేరం చేసి తప్పించుకునే క్రమంలో అతి వేగంతో వెడుతుంటే ఈప్రమాదం జరిగిందా? లేక నేరం చేయడానికి వెడుతున్నారా? అనేది తేలాల్సి ఉంది.

ఈ ఘటనలో మార్నింగ్ వాక్ కి వెళ్లిన తల్లీకూతుళ్లు అనురాధ, ఆమె కూతురు మృతి చెందగా.. మరో మహిళ మాళవిక తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించి... చికిత్స అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu