ములుగులో ఆశ్చర్యం.. పలువురి బ్యాంక్ అకౌంట్లలో వేలల్లో డబ్బు జమ.. వేరే అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకున్న జనం

Published : Aug 27, 2023, 07:27 AM IST
ములుగులో ఆశ్చర్యం.. పలువురి బ్యాంక్ అకౌంట్లలో వేలల్లో డబ్బు జమ.. వేరే అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసుకున్న జనం

సారాంశం

ములుగు జిల్లాలోని ఏటూరునాగారానికి చెందిన పలువురు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో ? ఎవరు పంపారో తెలియదు. ఈ విషయం తెలియడంతో పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారులు ఆ కాలనీకి చేరుకున్నారు. దీనిపై ఆరా తీశారు. 

ములుగు జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏటూరునాగారంలోని ఓ కాలనీకి చెందిన పలువురి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. అవి కూడా వేలల్లో, కొందరికైతే లక్షల్లో కూడా క్రెడిట్ అయ్యాయి. ఆ కాలనీకి చెందిన సుమారు 50 మంది అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ అయినట్టు వారికి మెసేజ్ వచ్చింది. దాదాపు ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.1 లక్ష వరకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఉద్యోగం చేయకూడదని.. భార్య చేయి నరికేసిన సీఆర్ పీఎఫ్ జవాన్..

బ్యాంకు సిబ్బంది పొరపాటున జమ చేశారని అనుకున్న అందరి అకౌంట్లు వివిధ ఒకే బ్యాంకులో లేవు. కొందరు అకౌంట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరి కొందరి అకౌంట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకొందరివి ఏపీజీవీబీవి కాగా.. మరి కొందరికి కెనరా బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే శనివారం బ్యాంకులకు సెలవు దినం. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పంపారనేది అర్థం కావడం లేదు. 

TSRTC: రక్షా బంధన్‌ సందర్భంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్‌ఆర్టీసీ

అయితే ఇలా డబ్బులు క్రెడిట్ అయిన మెసేజ్ వచ్చిన వెంటనే పలువురు తమ గూగుల్ పే, ఫోన్ వంటి యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి మార్గాల ద్వారా వాటిని వేరే అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. కాగా.. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అధికారులకు తెలిసింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు ఆ కాలనీకి చేరుకున్నారు. ఈ విషయంలో విచారణ జరిపారు.  
 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్