దిశ నిందితుల ఎన్ కౌంటర్: రేపే సుప్రీం తీర్పు

By narsimha lode  |  First Published May 19, 2022, 12:44 PM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.  ఈ  ఎన్ కౌంటర్ పై ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కూడా సుప్రీంకోర్టుకు ఈ ఏడాది జనవరిలోనే చేరింది.  


హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన Disha నిందితుల ఎన్ కౌంటర్ పై  Supreme Court రేపు తీర్పును వెల్లడించనుంది. దిశ నిందితుల Encounter పై సుప్రీంకోర్టు  Sirpurkar commission ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జనవరిలో సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదికను అందించింది. 

హైద్రాబాద్ కు సమీపంలోని షాద్ నగర్ చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద దిశపై నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన 2019 నవంబర్ 28న జరిగింది.   ఈ ఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను మహమ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జోల్లు నవీన్ లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. 

Latest Videos

undefined

నిందితులను తమకు అప్పగించాలని  పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దిశకు న్యాయం జరగాలంటే నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకొచ్చిన సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు గాను ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించినట్టుగా అప్పటిసీ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. 

ఈ ఎన్ కౌంటర్ పై హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేశాయి. ఈ ఎన్ కౌంంటర్ పై అనుమానాలు వ్యక్తం చేశాయి. విచారణకు డిమాండ్ చేశాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్ప్కూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. సిర్పూర్కర్ కమిషన్  హైద్రాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది. ఈ కమిషన్ నివేదికను ఈ ఏడాది జనవరి మాసంలో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు రేపు తీర్పును వెల్లడించనుంది. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్  విచారించింది.  వీటి ఆధారంగా తయారు చేసిన నివేదికను సిర్పూర్కర్ కమిషన్ ఉన్నత న్యాయస్థానానికి అందించింది. 

also read:Disha Accused Encounter: స్థలాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమిషన్

ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారులు సైబరాబాద్ సీపీగా అప్పట్లో పనిచేసిన వీసీ సజ్జనార్  సహా పోలీసు వ్యాన్ డ్రైవర్లను కూడా కమిషన్ విచారించింది కీలకమైన  రిపోర్టు తయారు చేసింది.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా కమిషన్ సభ్యులు పరిశీలించారు. అంతేకాదు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు అధికారిని కూడా  కమిషన్ విచారించి రిపోర్టు సిద్దం చేసింది. 

దిశ అదృశ్యమైన సమయంలో  పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని అప్పట్లో విమర్శలు తలెత్తాయి.ఈ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై సస్పెండ్ చేశారు సైబరాబాద్ సీపీ. 
 

click me!