సికింద్రాబద్ బోయిగూడ స్క్రాప్ గోడౌన్ గోడలు కుప్పకూలాయి. ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఈ గోడలను నేలమట్టం చేయకుండా జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ Bhoiguda స్క్రాప్ గోదాం గోడలు గురువారం నాడు కుప్పకూలింది. ఈ సమయంంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ స్క్రాప్ గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది మార్చి 23న బోయిగూడ Scrap గోడౌన్ లో Fire Accident జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను కూడా ఆ తర్వాత మరణించిన విషయం తెలిసిందే.
undefined
also read:బోయిగూడ అగ్ని ప్రమాదం: నెల రోజులుగా పరారీలోనే.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన టింబర్ డిపో యజమాని
అగ్ని ప్రమాదం కారణంగా స్క్రాప్ గౌడోన్ తీవ్రంగా దెబ్బతింది. ఈ గోడౌన్ Walls పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ గోడలను నేల మట్టం చేయకుండా Ghmc అధికారులు వదిలేశారు. అయితే ఇవాళ ఉదయం ఈ స్క్రాప్ గోడౌన్ గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే గోడలు కూలిన సమయంలో ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.
మార్చి 23వ తేదీ తెల్లవారుజాము మూడు గంటలకు షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు. అయితే ఫైర్ సిబ్బందికకి మాత్రం తెల్లవారుజామున 3:55 గంటలకు సమాచారం అందిందని ఫైర్ ఆఫీసర్ చెప్పారు.
ఈ సమాచారం అందుకొని ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలను మొదలు పెట్టాయి .అయితే ఈ గోడౌన్ లోనే 11 మంది ఉంటున్నారనే విషయాన్ని ఫైర్ సిబ్బందికి తెలియదు.. ఈ గోడౌన్లో కేబుల్స్, పేపర్లు ఉండడంతో మంటలు త్వరగా అంటుకొన్నాయి.గోడౌన్ ఫస్ట్ ప్లోర్ లో నిద్రపోతున్న 11 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు.. గోడౌన్ ఫస్ట్ ఫ్లోర్‌లో నిద్రపోతున్న వారంతా ఈ కార్బన్ మోనాక్సైడ్ పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి సజీవ దహనమయ్యారని శ్రీనివాస్ వెల్లడించారు. 11 మంది ఒకరిపై మరొకరు పడి సజీవ దహనమయ్యారని ఆయన వివరించారు.
ఫస్ట్‌ప్లోర్‌లో 11 మంది ఉన్నారనే విషయాన్ని తమ సిబ్బందికి ముందుగానే సమాచారం ఇస్తే వారిని కాపాడే ప్రయత్నం చేసే వాళ్లమని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుండి గాయాలతో బయటపడిన ప్రేమ్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తమ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లి చూస్తే అప్పటికే 11 మంది సజీవ దహనమయ్యారని శ్రీనివాస్ వివరించారు. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్ కూలీలే కావడం గమనార్హం. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రేమ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బిహార్ చాప్ర జిల్లాలోని ప్రేమ్‌కుమార్ (20) గత కొంతకాలంగా శ్రావణ్ స్క్రబ్ ట్రేడర్స్ గోదాంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు.
ప్రమాదం జరిగిన రోజు మంటల నుంచి తప్పించుకొని కిటికీలో నుంచి ప్రేమ్‌కుమార్ బయటకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారుదాదాపు 24 నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న ప్రేమ్ కుమార్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు.