ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ సర్కార్‌కి షాక్: స్టేకి సుప్రీం నిరాకరణ

By narsimha lode  |  First Published Feb 17, 2023, 12:44 PM IST

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసు విచారణను  ఈ నెల  27వ తేదీకి వాయిదా వేసింది  సుప్రీంకోర్టు.
 


హైదరాబాద్:  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో   తెలంగాణ హైకోర్టు తీర్పుపై  స్టే  ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు  నిరాసక్తత చూపింది. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు  ఎవరిని అరెస్ట్  చేయవద్దని   తెలంగాణ  సర్కార్  చేసిన వాదనపై  కూడా  ఉన్నత న్యాయస్థానం  స్పందించలేదు.బీఆర్ఎస్  ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసు విచారణను ఈ నెల  27 వ తేదీకి  వాయిదా  వేసింది సుప్రీంకోర్టు.  

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై  తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ   ఈ నెల  7వ తేదీన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్  చేసింది.    ఈ పిటిషన్ పై  ఈ నెల  8వ తేదీన   సుప్రీంకోర్టు విచారించింది.  అయితే ఈ కేసులో   స్టేటస్ కో ఇచ్చేందుకు  సుప్రీంకోర్టు  నిరాకరించింది. ఈ కేసును ఇవాళ విచారణ నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది.  

Latest Videos

ఇవాళ  సుప్రీంకోర్టు ధర్మాసనం  ఈ పిటిషన్ ను విచారించింది.  విచారణ సమయంలో  తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధవే  వాదనలు విన్పించారు.ఈ కేసుపై వాదనలు విన్పించేందుకు తనకు ఎక్కువ సమయం ఇవ్వాలని దుశ్యంత్ ధవే  కోరారు.  

also read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: స్టేటస్ కోకి సుప్రీం నిరాకరణ, ఈ నెల 17న విచారణ

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకి సంబంధించి సిట్  విచారణలో  కీలక అంశాలు వెలుగు చూశాయని  దుశ్యంత్ ధవే  సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.  ఈ ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా  ఉన్న విషయాన్ని  ధవే  ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.  

కేంద్రంలో  అధికారంలో  ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా  ఈ ఆధారాలున్నాయని  ధవే చెప్పారు. దీంతో  ఈ కేసు దర్యాప్తును సీబీఐ  విచారణకు అప్పగిస్తే  ఎలా అని  ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసు అంశానికి  సంబంధించి  హైకోర్టు తీర్పుపై స్టే కోరాడు దుశ్యంత్ ధవే. 

ఈడీ, సీబీఐ, ఐటీ కేసులకు సంబంధించి  విచారణ  అంశాలు  మీడియాకు  లీకు చేస్తున్నారనే విషయాన్ని సుప్రీంకోర్టు  పరిగణనలోకి తీసుకోవాలని  ఆయన  కోరారు. ప్రజలు ఎన్నకున్న  ప్రభుత్వాన్ని  కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని  ఆయన వాదించారు.

మరోవైపు ఈ కేసులో  బీజేపీ తరపున మహేష్  జెఠ్మలానీ  వాదించారు. ఈ కేసును రాజకీయ ప్రేరేపితమైందని  జెఠ్మలానీ చెప్పారు.  సిట్ విచారణ  పారదర్శకంగా లేదని  చెప్పారు.   ఈ  కేసుకి సంబంధించిన ఆధారాలు దేశ వ్యాప్తంగా  అందాయని  కూడా  జెఠ్మలానీ  గుర్తు  చేశారు. ఈ సమయంలో జస్టిస్ గవాయి జోక్యం  చేసుకున్నారు.ఈ కేసు ఆధారాలు  పెన్ డ్రైవ్  రూపంలో  తమకు  చేరాయన్నారు.  ఈ కేసు విచారణను ఈ నెల  27రి వాయిదా వేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటించింది.  

click me!