అంబర్ పేట ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం: కేసీఆర్ జన్మదిన వేడుకల్లో కిందపడ్డ వెంకటేష్

Published : Feb 17, 2023, 11:51 AM ISTUpdated : Feb 17, 2023, 12:14 PM IST
అంబర్ పేట ఎమ్మెల్యేకి  తప్పిన ప్రమాదం:  కేసీఆర్ జన్మదిన వేడుకల్లో  కిందపడ్డ వెంకటేష్

సారాంశం

కేసీఆర్  పుట్టిన రోజు సమయంలో  వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో  ప్రమాదంలో  అంబర్ పేట ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్  కి ప్రమాదం తృటిలో తప్పింది.  

హైదరాబాద్:  అంబర్ పేట  ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్‌కి శుక్రవారం నాడు  ప్రమాదం తప్పింది.  కేసీఆర్ పుట్టిన  రోజుు పురస్కరించుకొని  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో  ఇవాళ కాచిగూడలో  వేడుకలు నిర్వహించారు.  ఈ వేడుకల్లో అంబర్ పేట ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  టపాసులు పేల్చే సమయంలో   నిప్పు రవ్వలు  గ్యాస్ బెలూన్లపై పడ్డాయి. దీంతో గ్యాస్ బెలూన్లు పేలాయి.  గ్యాస్ బెలూన్లు పేలడంతో  ఎమ్మెల్యే  వెంకటేష్ సహ  బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుండి పరిగెత్తారు.   ఈ సమయంలో  వెంకటేష్  సహ కొందరు  బీఆర్ఎస్ కార్యకర్తలు కిందపడ్డారు.ఈ ఘటనలో  ఎమ్మెల్యే  వెంకటేష్ కి స్వల్ప గాయాలయ్యాయి.   

గ్యాస్ బెలూన్లను  ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ ఎగురవేసే సమయంలో  కార్యకర్తలు టపాసులు పేల్చారు.  టపాసుల నుండి వెలువడిన  నిప్పురవ్వలు  గ్యాస్ బెలూన్లపై పడ్డాయి.  దీంతో  గ్యాస్ బెలూన్లు  పేలాయి.    గ్యాస్ బెలూన్లు పేలడంతో  ఎమ్మెల్యే  సహ బీఆర్ఎస్ కార్యకర్తలు  పరుగెత్తారు.  ఈ సమయంలో  ఎమ్మెల్యే  వెంకటేష్ కిందపడిపోయాడు.  ఎమ్మెల్యేకి  స్వల్ప గాయాలయ్యాయని  బీఆర్ఎస్  కార్యకర్తలు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu