అసాంఘిక కార్యక్రమాలు: హైద్రాబాద్ శివారులోని 15 ఫాంహౌస్‌లపై కేసు

Published : Feb 17, 2023, 11:43 AM ISTUpdated : Feb 17, 2023, 12:10 PM IST
 అసాంఘిక కార్యక్రమాలు: హైద్రాబాద్  శివారులోని  15 ఫాంహౌస్‌లపై  కేసు

సారాంశం

హైద్రాబాద్ నగర శివారు ప్రాంతంలో  గల ఫామ్ హౌస్ ల్లో  పోలీసులు  ఇవాళ  సోదాలు నిర్వహించారు.  అసాంఘిక  కార్యకలాపాలు  సాగిస్తున్న  15 ఫామ్ హౌస్ లపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.

హైదరాబాద్: నగర శివారు ప్రాంతాల్లో  గల   ఫామ్ హౌస్ ల్లో  శుక్రవారం నాడు  పోలీీసులు సోదాలు నిర్వహించారు. ఫామ్ హౌస్ లలో  అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  15 ఫామ్ హౌస్ లపై  పోలీసులు కేసు నమోదు  చేశారు. అసాంఘిక  కార్యకలాపాలు నిర్వహిస్తున్న   ఫామ్ హౌస్ నిర్వాహకులను పోలీసులు  అరెస్ట్  చేశారు.  
హైద్రాబాద్ కు సమీపంలోని  మొయినాబాద్, శంకర్ పల్లి,  మేడ్చల్, షామీర్ పేటలో  గల ఫామ్ హౌస్ లలో   పోలీసులు సోదాలు నిర్వహించారు.  పేకాట, వ్యభిచారం, మందుబాబులకు  ఫామ్ హౌస్ లు అడ్డాగా మారాయని   పోలీసులు  చెబుతున్నారు..   ఫామ్ హౌస్ లలో  అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని  సైబరాబాద్  పోలీసులు  హెచ్చరించారు. 

నగర శివార్లలో గల   సతీష్, ట్రీ హౌస్ , ట్విస్ట్  ఎవిన్యూ ,ఆరెంజ్, న్యూగ్రీన్,  ఆజీజ్,  జగదీష్,  ఫోర్ ఎం, సామ్రాట్ ఫామ్స్ . ప్రిన్స్ రిసార్ట్స్,  ఎస్ఏ ప్రీమీయం,  బిగ్ బాస్ ఫామ్ హౌస్ లపై  కేసు నమోదు  చేశారు పోలీసులు.
 

PREV
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu