TS News: సూపర్ బ్యాంకు, ఒక్క పైసా కూడా చేతికి రాలేదు: బ్యాంకుపై ఓ దొంగ ప్రశంసలు.. ఖాళీ చేతులతో వెనక్కి

Published : Sep 03, 2023, 12:48 PM IST
TS News: సూపర్ బ్యాంకు, ఒక్క పైసా కూడా చేతికి రాలేదు: బ్యాంకుపై ఓ దొంగ ప్రశంసలు.. ఖాళీ చేతులతో వెనక్కి

సారాంశం

మంచిర్యాల జిల్లాలోని ఓ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి విఫలయత్నం జరిగింది. గురువారం రాత్రి దోపిడీకి వెళ్లిన ఓ దొంగ ఎంత ప్రయత్నించినా బ్యాంకులోకి దూరలేకపోయాడు. దీంతో బ్యాంకు భద్రత గురించి ఓ లేఖ రాసి వెళ్లిపోయాడు.  

హైదరాబాద్: ఓ దొంగ తెలంగాణ గ్రామీణ బ్యాంకు పై కన్నేశాడు. ఎలాగైనా దోచేయాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్టే ఓ రోజు రాత్రి ముసుగు ధరించి బ్యాంకు వద్దకు వెళ్లాడు. కానీ, ఎంతకూ లోపలికి వెళ్లలేకపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క రూపాయి కూడా దొంగతనం చేయలేకపోయాడు. దీంతో ఒక వైపు నిరాశ.. మరో వైపు బ్యాంకు సెక్యూరిటీ పైనా విశ్వాసం తన్నుకువచ్చింది. ఆ బ్యాంకు సెక్యూరిటీ సిస్టమ్‌ను మెచ్చుకుంటూ ఓ లేఖ రాసి అక్కడే పెట్టి ఒట్టి చేతులతో వెనుదిరిగాడు. అంతేకాదు.. తనకు ఒక్క రూపాయి కూడా దక్కలేదని, కాబట్టి.. తనను పట్టుకునే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన ఎక్కడో మరే రాష్ట్రంలోనో కాదు.. మన తెలంగాణలోనే చోటుచేసుకుంది. 

మంచిర్యాల జిల్లా నెన్నాల్ మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్‌లో ఈ చోరీ విఫలయత్నం జరిగింది. ఓ దొంగ అన్ని జాగ్రత్తలు తీసుకుని బ్యాంకు దోపిడీకి గురువారం రాత్రి (ఆగస్టు 31వ తేదీ) బయల్దేరాడు. బ్యాంకు వద్దకు వెళ్లాడు. అక్కడ సీసీటీవీలు ఉన్నాయి. అయినా.. ముఖానికి ముసుగు వేసుకుని చోరీకి విఫలయత్నం చేశాడు. ఆ బ్యాంకు ఏర్పాటు చేసుకున్న దుర్బేధ్య భద్రతా వ్యవస్థను లొంగదీసుకునే పని చేసి విఫలమయ్యాడు. దీంతో ఓటమిని అంగీకరించి వెనుదిరగడానికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఓ చిట్టి రాసి బ్యాంకు ముందు ఉంచాడు.

Also Read: దొంగల ఔదార్యం ! ఇంట్లో దోచుకునేంత గొప్ప వేమీ కనిపించక పోవడంతో రూ. 500 పెట్టి పరార్

‘నా వేలి ముద్రలు ఇక్కడ ఉండవు. మంచి బ్యాంకు. నేను ఒక్క రూపాయి కూడా చోరీ చేయలేకపోయాను. కాబట్టి. నన్ను పట్టుకోవద్దు’ అంటూ ఆ చిట్టిలో దొంగ రాసి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం యథావిధిగా బ్యాంకు సిబ్బంది విధుల కోసం వచ్చారు. అప్పటి వరకు అక్కడ చోరీకి ప్రయత్నం జరిగిందన్న విషయం వారికి తెలియదు. కానీ, వారు బ్యాంకు వద్దకు రాగానే.. ఆ దొంగ రాసి పెట్టిన చిట్టి దొరికింది. 

వెంటనే సీసీటీవీ నిఘా కెమెరాలను పరిశీలించారు. అందులో ఓ దొంగ కదలికలను గుర్తించారు. ముఖానికి ముసుగు వేసుకుని ఆ దొంగ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ దొంగ స్థానికుడే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. బ్యాంకు ఉద్యోగి కాకపోవచ్చని స్పష్టం చేశారు. బ్యాంకులో విలువై నవన్నీ ఉన్నాయని, ఏదీ చోరీ కాలేదని ఉద్యోగులు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు