తెలంగాణ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేయగా వెంటనే సీఎస్ శాంతికుమారి రాజీనామా చేసారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్ని గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాయి. ఇలా అధికార బిఆర్ఎస్ కూడా అభ్యర్థుల ఎంపిక విషయంతో ఆచితూచి వ్యవహరించింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ అవకాశం ఇవ్వకుండా కొత్తవారిని బరిలోకి దింపుతున్నారు. ఇలా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని తెలంగాణ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డికి ఈ ఎన్నికల్లో బరిలోకి దింపారు ఆ పార్టీ అధినేత కేసీఆర్.
నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ టికెట్ దక్కడంతో తెలంగాణ మహిళా కమీషన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేసారు. ఆమె రాజీనామాను సీఎస్ శాంతికుమారి ఆమోదించారు. ఈ మేరకు సీఎస్ పేరిట గురువారమే ఉత్తర్వులు జారీ అయ్యారు. ఇలా మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ బాధ్యతల నుండి తప్పుకున్న సునీతా లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసారు సునితా లక్ష్మారెడ్డి. అయితే తెలంగాణ ఏర్పాటుతర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ నర్సాపూర్ నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుదీర్ఘకాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీని వీడిన సునితా లక్ష్మారెడ్డి అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన కొంతకాలానికే ఆమెను మహిళా కమీషన్ బాధ్యతలు అప్పజెప్పారు సీఎం కేసీఆర్.
Read More నర్సాపూర్ అసెంబ్లీ నుండి సునీతా లక్ష్మారెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టు: బీ ఫారం అందించిన కేసీఆర్
గత మూడేళ్ళుగా మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ గా కొనసాగారు సునీతా లక్ష్మారెడ్డి. అయితే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డికి కాకుండా సునీతకు సీటు కేటాయించారు కేసీఆర్. మదన్ రెడ్డిని ఒప్పించి ఆయన చేతులమీదుగానే సునీతకు బీఫారం అందజేసారు పార్టీ అధినేత. ఇలా ఎన్నికల బరిలోకి దిగిన సునీతా లక్ష్మారెడ్డి మహిళా కమీషన్ పదవికి రాజీనామా చేయడం... వెంటనే సీఎస్ ఆమోదించడం జరిగింది.