తెలంగాణ ఎన్నికలు : వైఎస్సార్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు..

By SumaBala Bukka  |  First Published Oct 27, 2023, 8:00 AM IST

వైఎస్సార్టీపీ పార్టీకి బైనాక్యులర్ గుర్తు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో 119 నియోజక వర్గాల్లో ఈ గుర్తుతో బరిలోకి దిగబోతోంది షర్మిత పార్టీ. 


హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది.  ఎన్నికల షెడ్యూలు విడుదలవడంతో అన్ని పార్టీలుఅభ్యర్థుల జాబితా విడుదల విషయంలో తలమునకలుగా ఉన్నాయి. అయితే, వైయస్సార్ టిపీ మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉంది. ఈ పార్టీ  తొలిసారి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. ఇప్పటివరకు వైయస్సార్ టిపికి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించలేదు. తాజాగా వైఎస్ఆర్ టిపికి బైనాక్యులర్ గుర్తును కేటాయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు బైనాక్యులర్ గుర్తు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ టీపి అభ్యర్థుల జాబితాతో పాటు.. ఈ  బైనాక్యులర్ గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా ప్రణాళికలు రూపొందించుకుంటుంది.

Latest Videos

Etela Rajender: "కడుపునొస్తే గోలిమందు దొరకని గ్రామాల్లో సైతం మద్యం ఏరులైపారుతోంది "

వైయస్ షర్మిల 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి  అడుగు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, తన సోదరుడు వైఎస్ జగన్ తో విభేదాలతో…ఆమె తెలంగాణలో వైయస్సార్ టిపి పేరుతో పార్టీని మొదలుపెట్టారు. దీని పూర్తి పేరు యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ).  అప్పటినుంచి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తున్నారు. తన పార్టీ తరపున పాదయాత్ర ప్రారంభించిన షర్మిల.. తెలంగాణ వ్యాప్తంగా 3,800కి.మీ.లు పాదయాత్ర చేసి…ఇలా చేసిన తొలి భారతీయ మహిళగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వైయస్ షర్మిల చేరారు. 

ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడం కోసం షర్మిలారెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే, ఇవేవీ చివరకు ఫలించలేదు. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి  దిగబోతోంది. అంతకుముందు అనేకసార్లు వైయస్సార్ టిపి తరఫున ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.నాలుగు నెలల పాటు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు వైయస్ షర్మిల సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే 119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు షర్మిల. ప్రస్తుతం ఆమె పాలేరు నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా స్పష్టం చేశారు. 

click me!