రేపు హైద్రాబాద్‌కు సునీల్ భన్సల్:పార్టీ నేతలతో భేటీ

By narsimha lode  |  First Published Jul 3, 2023, 9:55 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇంచార్జీ సునీల్ భన్సల్   రేపు తెలంగాణకు  రానున్నారు. రెండు  రోజుల పాటు  సునీల్ భన్సల్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు.


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  సునీల్ భన్సల్  రేపు తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు  పార్టీ సంస్థాగత  వ్యవహారాలపై  సునీల్ భన్సల్  సమీక్షించనున్నారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ను మారుస్తారనే  ప్రచారం సాగుతుంది. మరో వైపు బండి సంజయ్ ఇవాళ ముంబై మీదుగా ఢిల్లీకి వెళ్లారు.  బండి సంజయ్   ఢిల్లీకి వెళ్లడం  కూడ రాజకీయంగా ప్రాధాన్యత చోటు  చేసుకుంది.

ఈ ఏడాది  చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు  జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం ప్లాన్  చేస్తుంది. అయితే  ఇటీవల కాలంలో చోటు  చేసుకున్న పరిణామాలు  బీజేపీ నేతల మధ్య  గ్యాప్ ను  బట్టబయలు చేస్తున్నాయి.  బీజేపీలో  నేతల మధ్య సయోధ్య లేదనే జరిగిన పరిణామాలను  చూస్తే అర్ధమౌతుందని  రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.

Latest Videos

also read:ఆ వ్యాఖ్యలు చేయలేదు, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించేవాడిని కాను: రఘునందన్ రావు వివరణ

తెలంగాణలో  బీజేపీని సంస్థాగతంగా బలోపేతం  చేయాల్సిన  అవసరం ఉందనే పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ తరుణంలో   సునీల్ భన్సల్ రెండు  రోజుల పాటు  పార్టీ నేతలతో  చర్చించనున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్ లో మార్పులు  చేర్పులు  జరిగే  అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో  పార్టీని బలోపేతం చేసేందుకు  సంస్థాగతంగా మార్పులు  చేర్పులు  చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం సాగుతున్న తరుణంలో సునీల్ భన్సల్  హైద్రాబాద్ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!