హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారు: ఉస్మానియాపై గవర్నర్ విమర్శలకు హరీష్ కౌంటర్

By narsimha lode  |  First Published Jul 3, 2023, 6:47 PM IST

ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం విషయమై  గవర్నర్  విమర్శలపై  తెలంగాణ  మంత్రి  హరీష్ రావు కౌంటరిచ్చారు.  


హైదరాబాద్:  మంచి చూడొద్దు, మంచి గురించి మాట్లాడొద్దు, మంచి వినొద్దనే రీతిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై  సౌందర రాజన్ వ్యాఖ్యలున్నాయని  మంత్రి హరీష్ రావు  అభిప్రాయపడ్డారు. ఉస్మానియా  ఆసుపత్రికి కొత్త భవనం విషయంలో  తెలంగాణ  గవర్నర్  తమిళిసై  సౌందర రాజన్  చేసిన విమర్శలకు  తెలంగాణ మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు. హైద్రాబాద్  నిమ్స్ ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్ సర్జరీ సిస్టం ప్రారంబించారు మంత్రి హరీష్ రావు .  అనంతరం  హరీష్ రావు  మాట్లాడారు. ఈ సందర్భంగా  గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ పై  వ్యాఖ్యలపై హరీష్ రావు వ్యాఖ్యానించారు.హాఫ్ నాలేడ్జ్ తో కొందరు కామెంట్స్ చేస్తున్నారని  మంత్రి  గవర్నర్ కు  కౌంటరిచ్చారు.  

తెలంగాణ వైద్య శాఖలో  జరిగిన  అభివృద్ధి గురించి కనిపించడం లేదా అని  హరీష్ రావు ప్రశ్నించారు.  వైద్య ఆరోగ్య శాఖలో  జరిగిన అభివృద్ధి గురించి  ఒక్క ప్రశంస కురిపిస్తే  మరింత ఉత్సాహంగా  పనిచేస్తామని  హరీష్ రావు  చెప్పారు. కష్టపడి పనిచేసేవారు  ప్రశంసను కోరుకుంటారన్నారు.  

Latest Videos

కష్టపడి పనిచేస్తున్న వారిని అభినందించకపోగా  విమర్శలు  చేస్తున్నవారిని  ఏమనాలని  హరీష్ రావు  ప్రశ్నించారు.  అవగాహన లేకుండా  విమర్శలు  చేస్తున్నారని  గవర్నర్ పై   పరోక్షంగా  హరీష్ రావు  విమర్శలు  చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులతో తెలంగాణ నిమ్స్ ఆసుపత్రి పోటీ పడుతుందని  హరీష్ రావు  చెప్పారు. 

also read:లీగల్ సమస్యతో ఉస్మానియాకు కొత్త భవనం నిర్మాణాన్ని తప్పించుకొనే యత్నం: కేసీఆర్ సర్కార్ పై తమిళిసై

తెలంగాణ ఏర్పాటు తర్వాత నిమ్స్ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. 4000 పడకలతో దేశంలోనే పెద్ద ఆసుపత్రిగా రికార్డునెలకొల్పబోతుందన్నారు.ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ నిమ్స్ లో చదివేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని హరీష్ రావు  తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి  కొత్త భవనం నిర్మాణం విషయమై  తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శలు  చేస్తున్నారు. గవర్నర్ విమర్శలపై తెలంగాణ మంత్రి  హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు.

ఉస్మానియా  ఆసుపత్రికి కొత్త భవనం నిర్మాణం విషయంలో  ఇచ్చిన హామీని నిలుపుకోవాలని  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  ట్విట్టర్ వేదికగా  కోరారు.  అయితే  ఈ వ్యాఖ్యలకు  మంత్రి హారీష్ రావు  కౌంటరిచ్చారు.  బీజేపీ అధికార ప్రతినిధి మాదిరిగా  గవర్నర్  మాట్లాడుతున్నారన్నారు

click me!